చిరంజీవి ఆచార్య ఈపాటికి రిలీజ్ అయ్యిపోయి.. చిరు లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆచార్య సినిమా రిలీజ్ అటుంచి ఇంకా షూటింగ్ పది రోజుల పాటు బ్యాలెన్స్ ఉంది. కారొన సెకండ్ వేవ్ తో అన్ని ఆగిపోయాయి. అయితే చిరంజీవి ఆచార్య తర్వాత మోహన్ రాజా తో లూసిఫెర్ షూటింగ్ కి హాజరవ్వాల్సి ఉంది. ఇప్పటికే చిన్న పార్ట్ షూటింగ్ జరుపుకున్న లూసిఫెర్ ఆగిపోయినట్లుగా, అలాగే మోహన్ రాజా డైరెక్టర్ స్థానం నుండి త్పపుకున్నట్టుగా ఆ మధ్యన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ జస్ట్ రూమర్స్ అని లూసిఫెర్ రీమేక్ ఆగిపోలేదని అన్నారు.
కానీ తాజాగా చిరంజీవి లూసిఫెర్ రీమేక్ ని పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తుంది. దర్శకుడు మోహన్ రాజా చేసిన మార్పులు చిరుని తృప్తి పరచలేదని, తెలుగు నేటివిటీకి మోహన్ రాజా చేసిన మార్పులేవీ సరిపోవని చిరు ఫీలవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో సుజిత్ , వినాయక్ చేసిన మార్పులకి తృప్తి చెందక చిరు వాళ్ళని త్పపించి మోహన్ రాజా స్క్రిప్ట్ కి ఓకె చెప్పారు. కానీ ఇప్పడూ మరోసారి అదే మార్పులు చిరుకి నచ్చలేదంటున్నారు. లూసిఫెర్ ని ఎలా మార్పు చేసినా తెలుగు ప్రేక్షకులు మెచ్చకపోవచ్చనే ఫీలింగ్ ఒకటైతే.. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో చిరు రిస్క్ లు చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది. అంటే చిరు ఆచార్య పూర్తి చేసి కొద్దికాలం విరామ తీసుకోవాలని అనుకుంటున్నారట. తర్వాత కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త కథలతో ముందుకు వెళ్లాలని చిరు భావిస్తున్నట్టుగా టాక్.