సినిమాల్లో విలన్ వేషాలు వేసి.. ప్రేక్షకులని భయపెట్టే సోను సూద్ కరోనా లాక్ డౌన్ మొదలైంది మొదలు రియల్ హీరోలా మారిపోయి.. కరోనా కారణంగానే కాదు.. ఇతర విషయాలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి తనవంతు సహాయం చేస్తూ కరోనా పేషేంట్స్ కి ఆపద్భాంధవుడిలా మారాడు. గత ఏడాది నుండి స్టిల్ ఇప్పటివరకు సోనుసూద్ తన సహాయాన్ని మానలేదు. అయితే తాజాగా కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి గురించి.. ఎప్పుడో చనిపోయిన సోను సూద్ తల్లి తల్లితండ్రులు ఇలాంటి టైం లో బ్రతికుండి కరోనా బారిన గనక పడి మరణిస్తే నా హృదయం ముక్కలయ్యేది అని అంటున్నాడు.
వాళ్ళు బ్రతికుండి.. ఇలా ఆక్సిజెన్ లేక, బెడ్స్ దొరక్క చనిపోతే నేను భరించే వాడిని కాదు. ఇలాంటి కరోనా టైం లో చాలామంది ప్రాణాలు పోగుట్టుకుంటుంటే.. అనేకమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులని, ఇలాంటి సంక్షోభాన్ని ఇప్పటివరకు చూసి కూడా ఉండము. నా పేరెంట్స్ గనక ఇలా ఆక్సిజెన్, బెడ్స్ కోసం పోరాడుతుంటే.. చూసి తట్టుకునేవాడిని కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోను సూద్. గతంలో సోను సూద్ ఫాదర్.. ఆకలితో ఉన్న వారికి సోను తో కలిసి ఆహారం పంచేవారట. ఆయన తల్లి కూడా లేని పిల్లలకి ఉచితంగా చదువు చెప్పేవారట. అంతటి గొప్ప తల్లితండ్రులకి పుట్టబట్టే సోను లో ఇన్ని మంచి లక్షణాలు అంటున్నారు ఆయన అభిమానులు.