ఆచార్య సినిమా విడుదలై ఇప్పటికి పది రోజు లు అవ్వాల్సింది. కానీ కరోనా కారణముగా మే 13 న విడుదల కావాల్సిన ఆచార్య మూవీ షూటింగ్ తో పాటుగా సినిమా కూడా వాయిదా పడింది. జస్ట్ 10 రోజులు షూటింగ్ చేస్తే ఆచార్య ఫినిష్ అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడింది. దానితో షూటింగ్ ఆపేసారు. చిరు ఆచార్య గ రామ్ చరణ్ సిద్ధగా కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ ఆషామాషీగా ఉండే.. గెస్ట్ రోల్ కాదని కొరటాల ఎప్పుడో రివీల్ చేసాడు. తాజాగా కొరటాల ఆచార్యపై అప్ డేట్ ఇచ్చారు. అదేమిటంటే ఆచార్యలో మెయిన్ ఎమోషన్ చరణ్ చుట్టూనే రన్ అవుతుందట.
ఆచార్య సెకండాఫ్ దాదాపు రామ్ చరణ్ సిద్ద పాత్ర కనిపిస్తుందని.. నీలాంబరిగా పూజ హేగ్డ్ పాత్ర కూడా బావుంటుంది అని చెప్పారు కొరటాల. ఇక పదిరోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పిన కొరటాల శివ, త్వరలోనే చరణ్, పూజా (సిద్ద - నీలాంబరి)పై చిత్రీకకరించిన నీలాంబరి .. సాంగ్‌ను రెండో పాటగా విడుదల చేస్తామని అన్నారు కొరటాల. ఆచార్య సినిమా ని మే 13 నుండి ఆగష్టు 22 కి పోస్ట్ పోన్ చేసినట్లుగా చెబుతున్నా.. థియేటర్స్ ఓపెన్ అయ్యాక కానీ ఆచార్య రిలీజ్ డేట్ పై క్లారిటీ రాదని తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా ఆచార్య కి తోడవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.