Advertisementt

ఆదిపురుష్ సీత చేతిలో 7 భారీ ప్రాజెక్ట్స్

Sun 23rd May 2021 07:55 PM
kriti sanon,adipurush sita,prabhas heroine,7 upcoming films  ఆదిపురుష్ సీత చేతిలో 7 భారీ ప్రాజెక్ట్స్
Adipurush Sita excited about having 7 upcoming films ఆదిపురుష్ సీత చేతిలో 7 భారీ ప్రాజెక్ట్స్
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకుడిగా మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కీ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ కి 1 నేనొక్కడినే సినిమా పెద్దగా హెల్ప్ చేసింది లేదు. తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా కూడా కృతి సనన్ కి ఉపయోగపడలేదు. దానితో కృతి సనన్ బాలీవుడ్ లోనే స్టిక్ అయ్యింది. అక్కడ వచ్చిన ఆఫర్స్ తో బాలీవుడ్ లోనే ఉండిపోయిన కృతి సనన్ కి ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీత గా అదిరిపోయే కేరెక్టర్ వచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడంతో ఇప్పుడు టాలీవుడ్ చూపు మరోసారి కృతి సనన్ మీద పడింది. 

అయితే ఓ న‌టిగా బ‌ల‌మైన పాత్ర‌ల్ని, ప్రాధాన్యమున్న పోషించాల‌నుకుంటున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించని, ఎవరూ వినని కొత్త పాత్ర‌ల్ని ఎంపిక చేసుకునే దిశ‌గా నా ప్రయాణం సాగుతుంది. నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు గడిచాయి. ఈ ఏడేళ్లలో విభిన్న కథా చిత్రాలతో మెప్పించాను. ప్రేక్షకులకు నచ్చే విధంగా పాత్రలని ఎంపిక చేసుకోవాలంటే.. సవాల్ తో కూడుకున్న పని. అయినా అందులో ఓ హ్యాపీనెస్ ఉంటుంది అని అంటుంది కృతి సనన్. ప్రస్తుతం ఆదిపురుష్ సీత చేతిలో ఏడు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ప్రభాస్ ఆదిపురుష్ ఒకటి కాగా.. గణ‌ప‌త్‌, మిమీ, భెడియా, హ‌మ్ దో హ‌మారే దో, బ‌చ‌ప‌న్ పాండే లాంటి సినిమాల్తో పాటుగా మరో హిందీ మూవీ కూడా కృతి సనన్ సైన్ చేసింది. ఇక ఆదిపురుష్ రిలీజ్ అయ్యాక కృతి సనన్ రేంజ్ ఇటు టాలీవుడ్ అటు తమిళ్ ని చుట్టెయ్యడం ఖాయం.

Adipurush Sita excited about having 7 upcoming films:

Kriti Sanon excited about having 7 upcoming films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ