పెళ్ళికి ముందు గ్లామర్ పాత్రలో మెప్పించిన కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రితో సారీ లుక్స్ లో, పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఆ తర్వాత సీనియర్ హీరోలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన కాజల్ గ్లామర్ ని మాత్రం వదల్లేదు. ఎప్పుడూ పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటింగ్ చేసే కాజల్ గత ఏడాది లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని అక్టోబర్ లో పెళ్లాడిన కాజల్ వెంటనే హాని మూన్ ముగించేసుకుని చిరు తో నటిస్తున్న ఆచార్య సెట్ లో వాలిపోయింది. పెళ్లి తర్వాతే నాగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
అయితే కాజల్ పాప సినిమాలు వదిలేస్తుంది.. నాగ్ మూవీ, ఆచార్య, తమిళ్ ఇండియన్ 2 మూవీస్ పూర్తయ్యాక కాజల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతోంది అనే టాక్ నడుస్తుంది. మరోపక్క తాను భర్త గౌతమ్ కిచ్లు సహకారంతోనే పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్న అని చెప్పిన కాజల్ సినిమాలు వదిలేస్తుంది అనే రూమర్ ని అస్సలు నమ్మబుద్ది కావడం లేదు. సరే అదంతా అలా ఉంటె తాజాగా కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే పాపకి పెళ్ళయినా ఏ మాత్రం ఊపుతగ్గలేదు.. ఆ గ్లామర్ ని అస్సలు మిస్ కాలేదు. ఇప్పటికి.. యంగ్ హీరోయిన్ లా మెరిసిపోతుంది కాజల్ అన్నప్పటికీ.. కాజల్ లుక్స్ డీ గ్లామర్ గా కనిపిస్తున్నాయి. అప్పుడే నిద్ర లేచిన ఫేస్ లా కనిపిస్తుంది కాజల్ లుక్. లుక్ ఎలా ఉన్నా.. పాప గ్లామర్ ఉంది చూశారూ.. పెళ్లయినా పాపలో గ్లామర్ మాత్రం తగ్గలేదు అనిపిస్తుంది..