Advertisementt

మోస్ట్ ఎలిజిబుల్ రిలీజ్ పై క్లారిటీ

Sat 22nd May 2021 10:27 PM
akhil,most eligible bachelor movie,ott,theatrical release,pooja hegde,bommarillu bhasker  మోస్ట్ ఎలిజిబుల్ రిలీజ్ పై క్లారిటీ
Akhil Movie Most Eligible Bachelor Will Come On OTT Platform? మోస్ట్ ఎలిజిబుల్ రిలీజ్ పై క్లారిటీ
Advertisement
Ads by CJ

అఖిల్ కి ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ సో సో హిట్స్ తప్ప అఖిల్ ని స్టార్ గా నిలబెట్టే సినిమా ఒక్కటీ లేకపోయింది. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్ రెండూ అఖిల్ ని మోసం చేసాయి. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గ్లామర్ డాల్ పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జులై 19 న రిలీజ్ డేట్ ఇచ్చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కష్టమని.. అల్లు అరవింద్ గారితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ కోసం ఓటిటి నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయని.. త్వరలోనే అఖిల్ మూవీ ఓటిటి డీల్ సెట్ అవుతుంది అనే టాక్ సోషల్ మీడియాలో మొదలయ్యింది.

ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినా ఇంకాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉండడం, అల్లు అరవింద్ కాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండడంతో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఓటిటికి అమ్మమని, కేవలం థియేటర్స్ మాత్రమే రిలీజ్ చేస్తామని, కరోనా పరిస్థితులు కుదుటపడిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్ గురించి చెబుతామని చిత్ర బృందం ఈ సినిమా ఓటిటికి అమ్మేస్తున్నారనే పుకార్లపై క్లారిటీ ఇచ్చేసింది. వరస పరాజయాలున్న అఖిల్ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యి హిట్ కొట్టాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ పక్కా మాస్ కమర్షియల్ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ గా చేస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ ఏజెంట్ లుక్ ఫాన్స్ ని, ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

Akhil Movie Most Eligible Bachelor Will Come On OTT Platform?:

Most Eligible Bachelor Not Eligible for OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ