Advertisementt

అసలే అందగాడు: ఇంకాస్త స్టైలిష్ గా

Sat 22nd May 2021 02:59 PM
trivikram,mahesh movie,ssmb28 update  అసలే అందగాడు: ఇంకాస్త స్టైలిష్ గా
Trivikram - Mahesh Movie update అసలే అందగాడు: ఇంకాస్త స్టైలిష్ గా
Advertisement
Ads by CJ

మహేష్ 40 ప్లస్ లోను 25 ఏళ్ళ కుర్రాడిలా మెరిసిపోతుంటాడు. ఆయన స్టయిల్, ఆయన లుక్స్ అన్ని ఇప్పటికీ బ్యాచిలర్ లా, చాలా హ్యాండ్ సం గా కనిపిస్తాడు. మహేష్ కి 40 ప్లస్ అంటే ఎవరూ నమ్మరు కూడా. మంచి ఫిజిక్ తో, మంచి అందాన్ని మెయింటింగ్ చేసే మహేష్ ని మరింత అందంగా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ సినిమాలంటేనే భారీ తనంతో భారీగా స్టయిల్ తో కూడుకున్నవి. ఆయన తన సినిమాల్లో హీరోలని చాలా స్టైలిష్ గా, డబ్బున్న వారిలా చూపిస్తాడు. కనీసం మీడియం రేంజ్ ఫ్యామిలీ అయినా హీరోకి ఉంటుంది.

ఆయన సినిమాలన్ని డబ్బు చుట్టూనే తిరుగుతాయి. అలాగే మాస్ జోలికి పెద్దగా వెళ్ళడు. ప్రస్తుతం మహేష్ కోసం SSMB28 స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ లైన్ సింపుల్ గానే అనిపించినప్పటికీ, ట్రీట్మెంట్ త్రివిక్రమ్ స్టైల్ లోనే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ని కొత్త లుక్ లో చూడడం ఖాయమని, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ ని మరింత స్టైలిష్ గా చూపించబోతున్నాడట. అంటే ఓ బిజినెస్ మ్యాన్ ల మహేష్ కనిపిస్తాడని టాక్. అలా వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ నుండి వస్తున్న ఈ SSMB28 పై అంచనాలు మాములుగా లేవు. ఆ అంచనాలు అందుకోవాలనే కసితో త్రివిక్రమ్ స్రిప్ట్ రాసుకుంటున్నాడట.

Trivikram - Mahesh Movie update:

Trivikram - Mahesh SSMB28 latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ