రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీపై వరల్డ్ వైడ్ గా అంచనాలున్నాయి. బాహుబలితో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి మరోసారి ఆర్.ఆర్.ఆర్ తన రికార్డులని తానే తుడిచెయ్యడానికి రెడీ అవుతున్నాడు. కరోనా సెకండ్ వెవ్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పోస్ట్ అవుతుంది అనుకుంటే.. అలాంటిదేం లేదంటూ ఎన్టీఆర్ బర్త్ డే కి అక్టోబర్ 13 నే సినిమా రిలీజ్ అని బర్త్ డే పోస్టర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం ఇప్పుడు ఓ భారీ డీల్ ని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అది ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరగడమే. నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది
పోస్ట్ రిలీజ్ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ వారు భారీ మొత్తం చెల్లించి సంపాదించుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆర్.ఆర్.ఆర్ అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను సుమారు 325 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి ఈ డీల్ నిజమైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇదొక రికార్డు అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే సినిమా ప్రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ వెర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం సుమారు రూ.900 కోట్లకు చేరిందని సమాచారం.
నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లుగా అప్పట్లో పెన్ మూవీస్, అలాగే ఆర్.ఆర్.ఆర్ టీం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ న్యూస్.