Advertisementt

బాలయ్య కోసం గోపీచంద్ పక్కా స్కెచ్

Fri 21st May 2021 06:47 PM
balakrishna,movies,bb3,akhanda movie,balayya - gopichand malineni,trisha - balayya combo,layan movie  బాలయ్య కోసం గోపీచంద్ పక్కా స్కెచ్
Balakrishna to romance Trisha Krishnan బాలయ్య కోసం గోపీచంద్ పక్కా స్కెచ్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తో సినిమాలు చేసే దర్శకులకి ఎలాంటి ప్రోబ్లెంస్ ఉండకపోయినా ఆయనకు హీరోయిన్స్ ని సెట్ చేసే విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సినిమాల నుండి బాలకృష్ణ సరసన నటిస్తున్న హీరోయిన్స్ ని చూడాలంటే ప్రేక్షకులే కాదు.. నందమూరి ఫాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి ఎంతో క్రేజ్, ఎంతో బజ్ ఉన్న BB3 అఖండ మూవీకి కూడా హీరోయిన్స్ మైనస్ అనే చెప్పాలి. ప్రగ్య జైస్వాల్ తీసేసేంత కాదు కానీ.. బాలకృష్ణ పక్కన ప్రగ్య జైస్వాల్ ఎలా ఉండబోతుందో అనే టెంక్షన్ మాత్రం బాలయ్య ఫాన్స్ కి ఉంది. 

బోయపాటి బాలకృష్ణ కోసం హీరోయిన్స్ ని సెట్ చెయ్యడానికి చాలా సమస్యలు కాదు నానా పాట్లు పడ్డాడు. ఇద్దరు ముగ్గురు ఒప్పుకుని జంపయ్యారు. అఖండ మూవీ మొదలయ్యాక హీరోయిన్స్ సెట్ అవడానికి చాలా టైం పట్టేసింది. కానీ ఈసారి బాలయ్య సినిమాకి అలాంటి ప్రాబ్లమ్ రాకూడదని గోపీచంద్ మలినేని ముందే పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. అఖండ పూర్తికాగానే గోపిచంద్ మలినేని తో బాలయ్య చెయ్యబోయే మాస్ మూవీ జులై నుండి మొదలు కావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అప్పటికల్లా బాలయ్య కోసం హీరోయిన్ ని సెట్ చేస్తాడట గోపీచంద్. ఇప్పటికే త్రిష ని గోపిచంద్ బాలయ్య కోసం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆలా అయితే గతంలో బాలయ్య - త్రిష కలిసి లయన్ మూవీలో నటించారు. ఇప్పుడు మరోసారి జోడి కడితే.. వాళ్ళు రెండోసారి స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నట్లే.

Balakrishna to romance Trisha Krishnan:

Balakrishna to romance Trisha Krishnan in Gopichand Malineni Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ