గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ని అరికట్టే ఆయుర్వేదం మందు పంపిణీపైనే న్యూస్ లు వినిపిస్తున్నాయి. కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం వందల్లో కాదు వేలల్లో జనాలు రావడంతో.. ఇప్పుడు కృష్ణపట్నం తెగ ఫెమస్ అయ్యిపోయింది. కరోనా నివారణ కోసం బొణిగి ఆనందయ్య అనే ఆయన ఉచితంగా ఆయుర్వేద మందుని పంపిణి చేయడం, ఆ మందు వాడిన వారికీ కరోనా తగ్గిపోవడం, అలాగే ఆక్సిజెన్ అవసరమైన వారికీ బొణిగి ఆనందయ్య ఔషధాన్ని కళ్ళల్లో వెయ్యగానే రెండు నిమిషాల్లో వాళ్ళకి ఆక్సిజెన్ అవసరం కాకపోవడం, ఇలా వీడియోస్ ని తెగ షేర్ చేస్తున్నారు యూత్.
అదే విషయం ఉదయం నుండి పలు టివి ఛానల్స్ కూడా చూపిస్తున్నాయి. ఈ రోజు కరోనా కేసుల గురించి హాస్పిటల్ ఆక్సిజెన్ గురించి, రాజకీయాలను గురించి కాదు.. కృష్ణపట్నం ఆయుర్వేదం మందు గురించే టివి ఛానల్స్ న్యూస్ లు ప్రచారం చేస్తున్నాయి. అక్కడకి కరోనా నివారణ ఔషధం కోసం పలు రాష్ట్రాల నుండి ఏపీలోని పలు జిల్లాల ప్రజలు తండోపతండాలుగా కృష్ణపట్నం దారి పట్టారు. అక్కడ మహా జాతరను తలపించేలా కరోనా మందు కోసం జనాలు గుమ్మిగూడి జాతరను తలపిస్తున్నారు. 60 వేలకి పైగా ఈ రోజు కృష్ణ పట్నంలో ఆ మందు కోసం ఎదురు చూస్తున్నారంటే అది ఎంతగా పాపులర్ అయ్యిందో ఆర్ధమవుతుంది. అయితే అక్కడకి జనాలు తండోపతండాలుగా వెళ్లడం, న్యూస్ ఛానల్స్ పబ్లసిటీ చూసిన ఏపీ సీఎం జగన్.. ఆ మందుపై శాస్త్రీయ పరిశోధన కోసం ఐసీఎంఆర్ కు ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే.. ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని.. అప్పటివరకు ఆ ఆయుర్వేద మందు పంపిణి ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు అధికారులు.