Advertisementt

ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌...

Fri 21st May 2021 12:45 PM
rajinikanth,mohan babu,vishnu manchu  ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌...
Original Gangsters! ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌...
Advertisement
Ads by CJ

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే.. గతంలో రజినీకాంత్ మోహన్ బాబు కోసం పెదరాయుడు సినిమాలో ఓ గెస్ట్ రోల్ కూడా చేసారు. మోహన్ బాబు - రజినీకాంత్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రజినీకాంత్ కి మోహన్ బాబు తోనే కాదు.. మంచు ఫ్యామిలీ మొత్తంతో మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అన్నాత్తె సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే  హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంట‌కి వెళ్లారు. 

అక్క‌డే రెండు రోజుల‌పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. అక్క‌డి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. మంచు లక్ష్మి సూపర్ స్టార్ తో దిగిన పిక్ ని అప్పుడు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది బాగా వైరల్ అయ్యింది. ఇక రజినీకాంత్ హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకుని చెన్నై వెళుతున్న స‌మ‌యంలో ర‌జినీకాంత్‌, మోహ‌న్‌బాబు, విష్ణు మంచు క‌లిసి దిగిన ఫోటోల‌ను ఒరిజిన‌ల్‌గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌.. అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు విష్ణు మంచు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Original Gangsters! :

Rajinikanth - Mohan Babu and then goofy Vishnu Manchu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ