కొద్ది రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి ఆయన కరోనా నుండి బయట పడిన విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే తాను కరోనా టైం లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఒత్తిడి ఎదురవకుండా ఉండేందుకు ఏమేం చేసాడో.. ఎలా గడిపాడో తన అనుభవనాలను చెబుతున్నాడు అనిల్ రావిపూడి. కరోనా వచ్చాక ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా గురించి ఆలోచిస్తూ కూర్చొకుండా.. పుస్తకాలు చదవడం, కొత్త స్క్రిప్టులు రాసుకుంటూ ఉండేవాడని.. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు తన సక్సెస్ ఫుల్ హీరోలు వరుణ్ తేజ్, వెంకీ లు ఫోన్ చేసేవారని వెంకటేశ్ తగిన జాగ్రత్తలు చెప్పగా.. వరుణ్ తేజ్ ధైర్యం చెప్పేవాడని అంటున్నాడు అనిల్.
ఇక తన సరిలేరు నీకెవ్వరూ హీరో మహేష్ కూడా ఫోన్ చేసారని.. ముందు ఒకసారి ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగి జాగ్రత్తలు చెప్పిన మహేష్ మరోసారి ఫోన్ చేసి తన సరదా మాటలతో నవ్వించడమే కాదు.. మీరు ఎవరిని కలిశారు, కరోనా ఎలా వచ్చింది లాంటి ప్రశ్నలతో నవ్వించేవారని చెబుతున్నాడు అనిల్ రావిపూడి. వాళ్ళు అలా ఫోన్స్ చేసి ధైర్యం చెప్పి, నవ్వించబట్టే తాను ఒత్తిడికి లోనవకుండా ఉండగలిగాను అని మహేష్ మాటలు మందుల్లా పని చేసి తనని కరోనా నుండి కోలుకునేలా చేశాయంటూ కరోనా అనుభవాలని పంచుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.