Advertisementt

ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ హిస్టరీలోనే న్యూ రికార్డ్

Fri 21st May 2021 09:44 AM
family man 2,ott,trailer record,samantha akkineni,family man 2 trailer record,record views  ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ హిస్టరీలోనే న్యూ రికార్డ్
Family man 2 Trailer: Newest Record In Indian OTT ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ హిస్టరీలోనే న్యూ రికార్డ్
Advertisement
Ads by CJ

సౌత్ గ్లామర్ హీరోయిన్ సమంత అక్కినేని కీలక పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఎన్ని అంచనాలు, ఎంత క్రేజ్ ఉందో.. ఆ ట్రైలర్ రిలీజ్ అవకముందు నుండే చూస్తున్నాం. రాజ్ అండ్ డీకే లు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి సీజన్ 2 పై అంచనాలు పెంచేశారు. మనోజ్ బాజ్ పేయీ ఎప్పటిలాగే అదిరిపోయే యాక్షన్ తో ఆకట్టుకోగా.. సమంత స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ వెబ్ సీరీస్ కి బ్యాక్ బోన్ సమంత అవ్వబోతుంది కాదు.. అవుతుంది. సమంత క్రేజ్, ఆమె పాపులారిటీ ఈ వెబ్ సీరీస్ పై చాలా ఉంది. ఈ సీరీస్ కోసం కోట్లాది ప్రేక్షకులు వెయిటింగ్. 

రీసెంట్ గా విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో.. 15 మిలియన్ల వ్యూస్, 500k లైక్స్‌ను సాధించింది. ఫ్యామిలీ మ్యాన్ క్రేజ్ దెబ్బకి నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మీర్జాపూర్ 2 రెండో స్థానంలోకి పడిపోయింది. దానితో ఫామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. సమంత డిఫ్రెంట్ రోల్ ప్లే చెయ్యడం.. ఫామిలీ మ్యాన్ స్టోరీ నార్త్ నుండి సౌత్ చెన్నై కి షిఫ్ట్ అవడం, సీజన్1 బ్లాక్ బస్టర్ కావడంతో సీజన్ 2 పై అంతకంతకు అంచనాలు ఆసక్తి పెరిగిపోతుంది. మరి జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ మరిన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో చూడాలి.

Family man 2 Trailer: Newest Record In Indian OTT:

Family man 2 Trailer released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ