ఎన్టీఆర్ బర్త్ డే సంబరాలు ఆకాశాన్నంటాయి. ఆయన నటిస్తున్న నటించబోయే మూవీ ల నుండి ఎన్టీఆర్ పుట్టిన రోజున అప్ డేట్స్ రావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందం వర్ణనాతీతం. ఆర్.ఆర్.ఆర్ నుండి కొమరం భీం పోస్టర్, #NTR30 నుండి ఎన్టీఆర్ న్యూ లుక్, #NTR31 నుండి అఫీషియల్ అనౌన్సమెంట్ తో ఎన్టీఆర్ ఫుల్ ఖుష్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే.. అన్న కళ్యాణ్ రామ్ కోసం తారక్ తెగ తాపత్రయ పడిపోతున్నాడు. తారక్ బర్త్ డే సందర్భంగా హ్యాపీ బర్త్ డే నాన్నా అంటూ ఎన్టీఆర్ కి విషెస్ పెట్టిన కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ చాలానే చేస్తున్నాడు. అంటే తాను నటిస్తున్న సినిమాల్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా భాగస్వామిగా దూర్చేస్తున్నాడు.
గతంలో NTR30 ని త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని నిర్మాతలతో కలిపి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ని కూడా భాగస్వామిని చేసాడు. ఆ సినిమా నుండి త్రివిక్రమ్ తో పాటుగా హారిక హాసిని వారు కూడా తప్పుకున్నారు. ఇక కొరటాల శివ తో NTR30 పట్టాలెక్కబోతుంది. అది యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రకటించినా ఆ సినిమాని కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. తాజాగా NTR31 ఎనౌన్సమెంట్ లోనూ మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా మారింది. ఎలాగూ కళ్యాణ్ రామ్ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. ఇటు నిర్మాతగా చాలా లాస్ లో ఉన్నాడు. అలా ఎన్టీఆర్ తాను చేసే సినిమాల్లో కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ని కలిపితే అన్న లైఫ్ సెటిల్ అనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ అలా చేస్తున్నాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ అనే కాదు.. మహేష్ తాను చేసే సినిమాల్ని ఆయా నిర్మాతలతో కలిసి వాటా పంచుకుంటున్నాడు. రామ్ చరణ్ ఎలాగూ సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ హౌస్ పెట్టేసి తండ్రి సినిమాలని నిర్మించేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తాను నటించే సినిమాలలో గీత ఆర్ట్స్ ని ఇరికించేస్తున్నట్టుగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అన్న కళ్యాణ్ రామ్ ని ఇతర నిర్మాతలతో కలిపేస్తున్నాడు. మేటర్ సింపుల్. ఇందులో పెద్ద వింతేమీ లేదు.