టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా మూవీలో ఏకంగా అల్లు అర్జున్ తో జోడి కట్టేసింది. గతంలో మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీలో నటించిన రష్మిక కి ఆ మూవీ ఇచ్చింది ఏం లేదు. అతి ఓవరేక్షన్ తో రష్మిక కేరెక్టర్ ఆ సినిమాలో బాగా తేడా కొట్టింది. దర్శకుడు కామెడీ చేయించే క్రమంలో రష్మిక కేరెక్టర్ ద్వారా వెగటు పుట్టించాడు. మరోసారి అలాంటి కేరెక్టర్ ఒప్పుకోనని రష్మిక మీడియా ముఖంగానే చెప్పింది. ఇక ప్రస్తుతం పుష్ప మూవీలో డీ గ్లామర్ పాత్ర చేస్తున్న రష్మిక సోషల్ మీడియాలో యమా యాక్టీవ్. జిమ్ వీడియోస్ ని అలాగే రకరకాల ఫేస్ ఎక్సప్రెక్షన్స్ తో క్యూట్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తుంటుంది.
అయితే ఎప్పుడూ గ్లామర్ కేరెక్టర్స్ తో ఆకట్టుకునే రష్మిక ఈ మధ్యన ఫ్లవర్స్ మధ్యన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తోనూ అదరగొడుతుంది. ఇప్పుడు తాజాగా తన చిన్నప్పటి పిక్ ఒకదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక.. ఆ పిక్ లో చిన్నప్పటి రష్మిక ని చూస్తే నిజంగా ముద్దొచ్చేస్తోంది. సో స్వీట్, సో క్యూట్ అనాలనిపిస్తుంది. రెడ్ టి షార్ట్ వేసుకుని.. స్టూల్ మీద మోచేతిని ఆనించి.. మెడ మీద చెయ్యి పెట్టుకుని తెగ ఆలోచిస్తూ కూల్ గా చూస్తున్న రష్మిక చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.