మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉంటున్నాడు. ఒక్కడున్నాడు మూవీ తర్వాత మనోజ్ మరో మూవీ చెయ్యలేదు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి పాన్ ఇండియా మూవీ చేస్తున్న మనోజ్ ఆ మూవీ అప్ డేట్ విషయంలో కాస్త సస్పెన్స్ ఉన్నప్పటికీ.. మనోజ్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాడు. రీసెంట్ గా ఓ స్పెషల్ ఫోటో షూట్ తో కొత్త మేకోవర్ లో షాకిచ్చిన మంచు మనోజ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఫాన్స్ ని ఎలాంటి హడవిడి చెయ్యొద్దు అని, ఇంట్లోనే సేఫ్ గా ఉండమని.. తనకి వాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలని వేడుకలు అక్కర్లేదని మెసేజ్ ఇచ్చిన మనోజ్ సేవా గుణం గురించి..
ప్రతి ఒక్కరూ మాస్క్ లు పెట్టుకోవాలని, శానిటైజర్లు వాడాలని, ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవాలని కోరిన మనోజ్ తన పుట్టిన రోజు సందర్భంగా కరోనా తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. మిత్రులు, అభిమానులు లతో కలిసి 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంచాడు మనోజ్. కరోనా కారణముగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేసేందుకు పుట్టినరోజు నాడు నా వంతు సాయం చేయనున్నాను. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఆవరసమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావొద్దు..అంటూ మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మరింది.
మరి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మంచు మనోజ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.