Advertisementt

కొమరం భీం: బల్లెం గురి తప్పదు

Thu 20th May 2021 10:30 AM
jr ntr birthday,ntr birthday gift,ntr,tarak,ntr30,ntr fans,ntr new look,komaram bheem poster in rrr,rrr special treat,ntr birthday special rrr komaram bheem look,komaram bheem rrr poster  కొమరం భీం: బల్లెం గురి తప్పదు
NTR Komaram Bheem Look Released కొమరం భీం: బల్లెం గురి తప్పదు
Advertisement
Ads by CJ

నందమూరి తారకరాముడి పుట్టిన రోజు కోసం ఫాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో.. సోషల్ మీడియా ఓపెన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. గత వారం రోజులుగా #JaiNTR హాష్ టాగ్ తో భీభత్సం సృష్టిస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కి కరోనా రావడంతో #GetWellSoonAnna అనే హాష్ టాగ్ తోనూ.. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కరోనా కారణముగా హోమ్ ఐసోలేషన్ లో బర్త్ డే వేడులకి దూరంగా ఉండడమే కాదు.. ఫాన్స్ ని కూడా సంబరాలు చెయ్యొద్దు అంటూ లెటర్ రాసాడు. కరోనా సెకండ్ వేవ్ కారణముగా అందరూ ఇళ్లలో ఉండండి అంటూ ఫాన్స్ ని కూల్ చేసాడు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆర్.ఆర్.ఆర్ నుండి స్పెషల్ సర్ప్రైజ్ రాబోతున్నట్టుగా ఒక రోజు ముందే టీం ప్రకటించింది. అది తారక్ బర్త్ డే రోజున ఉదయం 10 గంటలకు రివీల్ చేస్తామని చెప్పారు.

చెప్పినట్టుగానే చెప్పిన టైం కి ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ కి స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. అది ఎన్టీఆర్ కొమరం భీం లుక్. బల్లెం గురి తప్పదు అన్నట్టుగా ఎన్టీఆర్ కసితో బల్లెం విసురుతున్న లుక్ లో ఎన్టీఆర్ న్యూ లుక్, మేకోవర్ అద్భుతమే. పంచె కట్టుతో.. నడుముకి తుండు కట్టుకుని, కుడి చేతితో బల్లెం పట్టుకుని.. ఎడమ చేతితో గురి చూస్తూ.. ఉగ్ర రూపంతో బల్లెం విసురుతున్న కొమరం భీం లో ఎన్టీఆర్ కనిపించడం లేదు.. మహోగ్రరూపుడిగా కొమరం భీమ్ కనిపిస్తున్నాడు. ఆకాశం ఉరుములతో గర్జిస్తుంటే.. కొమరం భీం గా ఎన్టీఆర్ ని చూస్తే ఫాన్స్ కి పూనకాలే అన్నట్టుగా ఉంది ఆ లుక్. మరి రాజమౌళి రామ్ చరణ్ బర్త్ డే కి అల్లూరిగా రామ్ చరణ్ పోస్టర్ వదిలితే.. ఇప్పుడు కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్ ని వదిలి ఫాన్స్ ని కూల్ చేసేసాడు. 

రాజమౌళి ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. My Bheem has a heart of gold. But when he rebels, he stands strong and bold! Water wave Here’s @tarak9999 as the INTENSE #KomaramBheem from #RRRMovie.. అంటూ ట్వీట్ చేసాడు.

NTR Komaram Bheem Look Released:

Jr NTR birthday gift to fans is intense new look as Komaram Bheem

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ