Advertisementt

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: NTR30 లుక్

Thu 20th May 2021 09:02 AM
ntr,tarak,ntr birthday special look,ntr30 look,ntr30 special poster,tarak birthday,tarak birthday special in ntr30,rrr movie,rrr movie komaramm bheem poster  ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: NTR30 లుక్
NTR Birthday Special: NTR30 Look ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: NTR30 లుక్
Advertisement
Ads by CJ

గత ఏడాది కరోనా లాక్ డౌన్ లో చప్పగా సాగిపోయిన ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ ఏడాది కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. అది కూడా ఎన్టీఆర్ నటించబోయే కొత్త సినిమా పోస్టర్ తో. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తదుపరి మూవీ కొరటాల శివ తో పాన్ ఇండియా లెవల్లో NTR30 ని ఎనౌన్స్ చేసాడు తారక్. కరోనా సెకండ్ వేవ్ ఇంత బాడ్ సిట్యువేషన్ లో తన బర్త్ డే సెలెబ్రేషన్స్ ని చెయ్యొద్దు అని ఫాన్స్ కి స్మూత్ గా లెటర్ రాసిన ఎన్టీఆర్ కి కొరటాల శివ సినిమా నుండి బర్త్ డే విషెస్ పోస్టర్ అందించింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు న 12 గంటలకే కొరటాల - ఎన్టీఆర్ కాంబో NTR30 నుండి తారక్ కి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ వదిలారు.

ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా ఫార్మల్ గా చాలా స్టైలిష్ గా.. సింపుల్ గా టక్ చేసుకుని రెండు చేతులు జేబులో లో పెట్టుకుని.. చూస్తున్న లుక్ కి కిర్రాక్ స్పందన వస్తుంది. ఎన్టీఆర్ ఫాన్స్ కి NTR30 నుండి స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. దానితో వారు సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ కలిసి కేక్ కట్ చెయ్యకపోయినా.. ఇలాంటి స్పెషల్ లుక్స్ తో వాళ్ళు పండగ చేసుకోవడం ఖాయం. ఇక ఈ రోజు విడుదల కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ కోసం తారక్ ఫాన్స్ వెయిటింగ్. మరి ఆర్.ఆర్.ఆర్, NTR30 నుండి స్పెషల్ ట్రీట్స్ వచ్చేసినా ఎన్టీఆర్ ఫాన్స్ కి NTR31 అనౌన్సమెంట్ కూడా వచ్చేస్తే బావుండు అనుకుంటున్నారు. 

అది కూడా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబో NTR31 మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో అనౌన్సమెంట్ ని కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆ విషయాన్ని ఎమన్నా రివీల్ చేస్తారేమో చూడాలి.

NTR Birthday Special: NTR30 Look:

NTR30: Ntr birthday Special Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ