కరోనా.. కరోనా.. అంటూ దేశం మొత్తం తల్లడిల్లిపోతుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి విషయంలో లాక్ డౌన్, కర్ఫ్యూలు పెట్టాయి. లాక్ డౌన్స్ అమలు చెయ్యడంతో కరోనా కేసులు కూడా తగ్గు ముఖం పట్టాయి. కేసులు తగ్గుతున్నా దేశవ్యాప్తంగా డెత్ రేటు పెరుగుతుంది. అయితే ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమలవుతుంటే.. తెలంగాణాలో నాలుగు గంటల సడలింపు.. 20 గంటల లాక్ డౌన్ ని అమలు చేస్తుంది ప్రభుత్వం.. మే 12 నుండి లాక్ డౌన్ మొదలైంది. మొదలైన నాలుగైదు రోజుల పాటు లాక్ డౌన్ పటిష్టంగానే అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
కానీ లాక్ డౌన్ ఎప్పుడైతే కేసీఆర్ సారు మే 30 వరకు పొడిగిస్తున్నట్టుగా చెప్పారో.. అప్పటినుండి ప్రజలు లాక్ డౌన్ ని లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఉదయం పది గంటల వరకే ఆంక్షల సడలింపు అన్నా కూడా పది గంటల తర్వాత కూడా జనసందోహం రోడ్లపైనే తిరుగుతుంది. లాక్ డౌన్ పాస్ లు అన్ని అయితే జారీ చెయ్యలేరు. ఇక ఆంక్షల సడలింపు టైం లో హైదరాబాద్ మహానగరంలో పెద్దగా పోలీస్ లు కూడా కనిపించడం లేదు. లాక్ డౌన్ టైం లో రోడ్స్ మీద వెహికల్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అసలు హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలవుతుందా? అనే సందేహం కలుగుతుంది. భారీ నష్టాలను ఓర్చి ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టినా.. ప్రజలు ఆలోచించడం లేదు. ఆదివారం నాన్ వెజ్ మర్కెట్స్ అయితే కిటకిటలాడుతున్నాయి. అక్కడ వారిని డూపు చేసే నాధుడే లేరు.
బారికేడ్లు పెట్టినా వాహనదారులని పోలీస్ లు పెద్దగా చెక్ చెయ్యడం లేదంటున్నారు. సడలింపు టైం లో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీద గుమి గూడుతున్నా పోలీస్ లు పట్టించుకోవడం లేదంటూ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. పాస్ ఉన్న వారు, లేని వారు ఇలా ఎవరికి వారే రోడ్లపైకి వస్తూ ఆదేశాలను లెక్క చెయ్యడం లేదు. అటు ప్రభుత్వమూ లాక్ డౌన్ విషయం సీరియస్ గా తీసుకోలేదనిపిస్తుంది. మరి లాక్ డౌన్ పై డీజీపీ ఉన్నతాధికారులకు స్ట్రిట్ గా ఆర్డర్లు పాస్ చేసినా పరిస్థితి అలానే ఉంది అంటే.. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో విఫలమైనట్టే.