Advertisementt

పవన్ తో సినిమా ఓకె అయితే నేనే చెబుతా

Wed 19th May 2021 12:25 PM
bandla ganesh,pawan kalyan,vakeel saab,bandla - pawan combo,pawan latest movie news,ganesh badnla  పవన్ తో సినిమా ఓకె అయితే నేనే చెబుతా
Pawan Kalyan says okay to Bandla Ganesh next పవన్ తో సినిమా ఓకె అయితే నేనే చెబుతా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఈమధ్యనే కరోనా బారిన పడి కోలుకున్నారు. పవన్ కళ్యాణ్ కోలుకున్నా ప్రస్తుతం కరోనా సెకండ్ వలన ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ కి బ్రేకులు పడ్డాయి. ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ తో బాక్సాఫీసుని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ అయ్యారు. దానితో ఆయన నెక్స్ట్ మూవీస్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, ఏకే రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ, సురేందర్ రెడ్డి కి కమిట్మెంట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తో తదుపరి మూవీ కోసం బండ్ల గణేష్ వెయిటింగ్.

అయితే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ - బండ్ల గణేష్ - పూరి కాంబోలో మూవీ ఉండబోతుంది అని, కాదు రమేష్ వర్మ దర్శకత్వంలో బండ్ల పవన్ కళ్యాణ్ తో మూవీ తెరకెక్కించబోతున్నాడని, రమేష్ వర్మ ఇప్పటికే పవన్ కి లైన్ చెప్పి బండ్ల తో సినిమా ఓకె చేయించుకున్నాడనే న్యూస్ నడుస్తుంది. బండ్ల గణేష్ మాత్రం పవన్ కళ్యాణ్ తనతో సినిమా చేస్తా అని మాటిచ్చాడు కానీ.. దానికి సంబందించిన పనులేమీ నేను మొదలు పెట్టలేదు.. అని చెప్పిన బండ్ల గణేష్.. రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేను మూవీ చేయబోతున్నా అని వస్తున్న వార్తల్లో నిజం లేదని, పవన్ తో సినిమా ఓకె కాగానే తానే స్వయంగా ఆ సినిమా గురించి వెల్లడిస్తా అని.. అప్పటివరకు ఎలాంటి గాలి వార్తలను నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

Pawan Kalyan says okay to Bandla Ganesh next:

Bandla Ganesh Clarity on Pawan Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ