ఫాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బర్త్ డే రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. రేపు ఎన్టీఆర్ బర్త్ డే ని ఓ రేంజ్ లో ఊహించుకుంటూ ఎన్టీఆర్ ఫాన్స్ #JaiNTR హాష్ టాగ్ ని గత వారం రోజులుగా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. అయితే గత ఏడాది లాక్ డౌన్ లో కరోనా కారణముగా తన పుట్టిన రోజు వేడుకలకి దూరంగా ఉన్న ఎన్టీఆర్.. ఫాన్స్ కి తన బర్త్ డే ని హడావిడి చెయ్యొద్దు అని, వేడుకలకి దూరంగా ఎవరి ఇంట్లో వాళ్ళు సేఫ్ గా ఉండాలని తన పుట్టిన రోజు వేడుకలని చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియాలో లెటర్ రూపంలో తెలియజేసాడు. ఆ ఏడాది ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ నుండి కొమరం భీం ట్రీట్ రాకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు.
ఈ ఏడాదైనా ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆర్.ఆర్.ఆర్ నుండి ట్రీట్ వస్తుంది, కొరటాల మూవీ పోస్టర్ వస్తుంది.. ఎన్టీఆర్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలనుకుంటున్న ఫాన్స్ కి ఎన్టీఆర్ మరోసారి నిరాశశపరిచాడు. ప్రస్తుతం కరోనా నుండి తాను కోలుకుంటున్నా అని, నా అభిమానులకి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్దీ రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోస్ చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట నిచ్చాయి. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బావున్నాను, త్వరలోనే కోలుకుని కోవిడ్ ని జయిస్తాను. ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ ఏడాది మీరు ఇంటి పట్టునే ఉంటూ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే కానుక అంటూ లెటర్ రూపంలో అభిమానులకు ఎన్టీఆర్ సందేశాన్ని పంపించాడు.
ఇక పుట్టిన రోజు వేడుకలు చేసుకునే సమయం ఇది కాదు.. మన దేశం కరోనా తో యుద్ధం చేస్తుంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న డాక్టర్స్, నర్సులు, ఫ్రెంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి.. అందరికి అండగా నిలవాలి అంటూ అభిమానులకి సందేశాన్ని పంపాడు ఎన్టీఆర్. మరి ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎన్టీఆర్ ఫాన్స్ మిస్ అయినట్లే.