Advertisementt

వ్యాక్సిన్ వేయించుకున్న ప్రేమ జంట

Tue 18th May 2021 10:23 PM
lady super star,nayanthara,vignesh shivan,corona,covid,vaccinated,love birds  వ్యాక్సిన్ వేయించుకున్న ప్రేమ జంట
Love Birds get vaccinated వ్యాక్సిన్ వేయించుకున్న ప్రేమ జంట
Advertisement
Ads by CJ

కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది సెకండ్ వేవ్ వస్తే కానీ తెలియలేదు. చాలామంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుని మీరూ వేయించుకోండి అని చెబితే వింతగా చూసిన జనాలు.. ఈరోజు వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ సెంటర్స్ కి పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందక ఫస్ట్ డోస్ ఆపేసి సెకండ్ డోస్ వారికీ ప్రధాన్యతనిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే చాలామంది సెలబ్రిటీస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకుని పిక్స్ దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్, సినీ ప్రముఖులు నాగార్జున, మోహన్ బాబు, మంచు లక్ష్మి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలానే వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక బాలీవుడ్ స్టార్స్ చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లలో ఉన్నారు. తాజాగా కోలీవుడ్ ప్రేమ పక్షులు నయన్ - విగ్నేష్ శివన్ లు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నయనతార చెన్నై లో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. అంతేకాకుండా ఆమె ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా వ్యాక్సినేషన్ సెంటర్ లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. కోలీవుడ్ ప్రేమ జంట నయనతార - విగ్నేష్ శివన్ లు ఒకేసారి వ్యాక్సినేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మరింది.

Love Birds get vaccinated :

Nayanthara - Vignesh Shivan gets vaccinated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ