తెలంగాణా హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్, అలాగే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు పెట్టి కరోనా కట్ఠడి చెయ్యమని చెప్పగా చెప్పగా.. తెలంగాణ ప్రభుత్వం కోర్టు మొట్టికాయలు వేసే వరకు ఆగి నైట్ కర్ఫ్యూ పెట్టడం, తర్వాత కోర్టు వార్నింగ్ తో లాక్ డౌన్ షురూ చెయ్యడం చూసాం.. కేసీఆర్ కరోనా నుండి కోలుకుని హడావిడిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓ పది రోజుల పాటు తెలంగాణాలో లాక్ డౌన్ పెడుతున్నట్లుగా అనౌన్స్ చేసారు. ఉదయం ఆరు గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు సడలించారు.
అయితే ఈ 21 తో లాక్ డౌన్ గడువు ముగియడంతో.. మళ్ళీ 20 న కేబినెట్ మీటింగ్ పెట్టి లాక్ డౌన్ పొడిగించే విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటారని అంటుండగానే.. కేసీఆర్ ఈ రోజు మంగళ వారం ఫోన్ లో తెలంగాణ మంత్రుల అభిప్రాయంతో మరోసారి లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా 20 న జరగాల్సిన కేబినెట్ మీటింగ్ ని రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. మే నెల 30 వరకు తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఎలాంటి ఆంక్షలు అమలవుతాయో అవే ఆంక్షలు పొడిగించిన లాక్ డౌన్ లోను అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
మరి ఈ లాక్ డౌన్ పొడిగింపు వ్యవహారం 2020 లో జరిగినట్లే 2021 లో రిపీట్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. లాక్ డౌన్ పెట్టాక కరోన కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తుంది.