కొరటాల శివ తన సినిమాల్లో స్టార్ హీరోలతో పాటుగా పేరు మోసిన నటులని తీసుకుంటాడు. తన ఫస్ట్ సినిమాలో ప్రభాస్ తర్వాత అంతటి ఇంపార్టెంట్ పాత్రని సత్యరాజ్ కి ఇచ్చిన కొరటాల శివ.. శ్రీమంతుడులో జగపతి బాబుని తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ తో తీసిన జనతా గ్యారేజ్ టైం లో ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకొచ్చారు కొరటాల శివ. ఇక మహేష్ బాబు భారత్ అనే నేను సినిమా కి శరత్ కుమార్ ని తీసుకున్న కొరటాల శివ ఆచార్యలో లో చిరు కోసం ఏకంగా స్టార్ హీరో రామ్ చరణ్ నే దింపేసాడు. ప్రస్తుతం ఆచార్య మూవీపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం ఆ సినిమాలో చరణ్ నటించడమే.
ఇక ఇప్పడు ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే NTR30 సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించే యోచనలో కొరటాల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ - మమ్ముట్టి పాత్రలు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. అంటే తండ్రి కొడుకులా, మావ అల్లుళ్ళ అనేది క్లారిటీ లేదు కానీ.. NTR30 లో కోసం కొరటాల శివ మమ్ముట్టిని ని ఇన్వాల్వ్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అప్పట్లో జనతా గ్యారేజ్ కోసం మోహన్ లాల్ ని ఎన్టీఆర్ కోసం దింపిన కొరటాల ఇప్పుడు అదే ఎన్టీఆర్ కోసం మమ్ముట్టిని దింపబోతున్నాడనే న్యూస్ మాత్రం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఎలాగూ పాన్ ఇండియా మూవీ కాబట్టి హీరోయిన్ గా కియారా అద్వానీ ని, ఇలా మలయాళ, తమిళ నటులని ఇన్వాల్వ్ చేస్తే సినిమాపై క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు.