అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఇప్పుడు టాక్ అఫ్ ద ఇండియా అయ్యింది. ఎందుకంటే పుష్ప రెండు పార్టులుగా విడుదల కాబోతుంది. రాజమౌళి బాహుబలిని రెండు పార్టులుగా భారీగా తెరక్కించాడు అంటే.. అందులో ఉండే ట్విస్ట్ లు, అందులో ఉండే కథ అన్ని రెండో భాగం కోసం వెయిట్ చేయించేలా చేసింది బాహుబలి పార్ట్ 1. పార్ట్ వన్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. బాహుబలి పార్ట్ 2 కోసం ప్రపంచం అంతా వెయిట్ చేసేలా చేసింది. అందుకే రాజమౌళి కూడా ఎక్కడ తగ్గకుండా భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు మెచ్చేలా చేసాడు.
మరి ఇప్పుడు రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ లో ఏం చూపిస్తారు? రెండో పార్ట్ లో ఏం చూపించబోతున్నారో? అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులను రెండో పార్ట్ కోసం అల్లు అర్జున్ అండ్ సుక్కులూ వెయిట్ చేయించగలరా? సుకుమార్ - అల్లు అర్జున్ లాజిక్ ఎవరికి అర్ధం కావడం లేదు కానీ.. ఇప్పడు పుష్ప రెండు పార్టులు అనగానే ఈ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చేరింది. అసలు పుష్ప పాన్ ఇండియా మూవీ అనగానే 200 కోట్ల బడ్జెట్ అన్నవారు.. ఇప్పుడు రెండు పార్టులకి కలిపి 250 కోట్లు అంటున్నారు. అంటే దాదాపుగా పార్ట్ వన్ కి 200 కోట్లు, పార్ట్ టు కి 50 కోట్లు పెడుతున్నారట. అన్నట్టు పుష్ప ఫస్ట్ పార్ట్ కి పుష్ప టైటిల్ ఉంచేసి.. సెకండ్ పార్ట్ టైటిల్ ని మార్చేస్తారని అంటున్నారు.