Advertisementt

దిల్ రాజుకి షాకిచ్చిన డైరెక్టర్

Tue 18th May 2021 04:56 PM
venu sriram. vakeel saab,pawan kalyan,dil raju camp,producer dil raju  దిల్ రాజుకి షాకిచ్చిన డైరెక్టర్
Sriram Venu walks out of Dil Raju Camp దిల్ రాజుకి షాకిచ్చిన డైరెక్టర్
Advertisement
Ads by CJ

దిల్ రాజు తన కాంపౌండ్ లో హిట్ కొట్టిన డైరెక్టర్ ని సాధారణంగా బయటికి వెళ్లనివ్వడు. వెంటనే తన బ్యానర్ లోనే సినిమా అనౌన్స్ చేసేస్తుంటాడు. ఆయన ఆస్థానంలో చాలామంది దర్శకులు లాకైపోయి ఉన్నారు. వరస హిట్స్ ఉన్న అనిల్ రావిపూడి ఇప్పటికీ దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉన్నాడు. ఇక తాజాగా ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో వేణు శ్రీరామ్ దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉన్నాడు. తదుపరి మూవీ ని కూడా వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లోనే అంటే ఐకాన్ మూవీ ని అల్లు అర్జున్ తో చేస్తాడేమో అనుకుంటున్నారు.

అయితే వేణు శ్రీరామ్ ఏ నిర్మాతలతో తనకి కమిట్మెంట్స్ లేవని, ఎవ్వరి దగ్గర అడ్వాన్స్ లు తీసుకోలేదని.. వకీల్ సాబ్ తర్వాత ఓ స్టార్ హీరో తోనే సినిమా చేస్తానని చెబుతున్నాడు. అంటే దిల్ రాజు తో ఓ సినిమాకి కమిట్ అయినా.. ఇతర నిర్మాతలతో సినిమా చెయ్యడానికి రెడీ అంటూ చెప్పేసరికి.. వేణు శ్రీరామ్ కి వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ ఉంది కనక.. వేణు శ్రీరామ్ కి ఇతర బడా నిర్మాణసంస్థలు భారీ బడ్జెట్ మూవీస్ ని సెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. మరి ఈలెక్కన వేణు శ్రీరామ్ డైరెక్ట్ గా దిల్ రాజుకి షాకిచ్చినట్టే కనిపిస్తుంది.. వేణు శ్రీరామ్ వ్యవహారం. ఎందుకంటే వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ చెయ్యబోయే సినిమాపై భారీ అంచనాలు, క్రేజ్ ఉంటుంది. అది దిల్ రాజు కి బాగా కలిసొచ్చేది. కానీ వేణు శ్రీరామ్ బయటికెళ్ళిపోతే దిల్ రాజుకి లాసేగా.

Sriram Venu walks out of Dil Raju Camp:

Venu Sriram out of Dil Raju camp?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ