Advertisementt

ఎఫ్ 3 కొత్త షెడ్యూల్ డేట్ వచ్చేసిందా

Tue 18th May 2021 02:43 PM
f3 movie,venkatesh,anil ravipudi,varun tej,tamanna,mehreen kaur,venky f 3,f3 latest update  ఎఫ్ 3 కొత్త షెడ్యూల్ డేట్ వచ్చేసిందా
F3 New schedule date has arrived ఎఫ్ 3 కొత్త షెడ్యూల్ డేట్ వచ్చేసిందా
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి - వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా దిల్ రాజు ఎఫ్ 3 ని అదే టీం తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిన ఎఫ్ 3 చిత్రీకరణ అనిల్ రావిపూడికి కరోనా రావడంతో ఆగిపోయింది. మరోపక్క వెంకటేష్ దృశ్యం, నారప్ప  షూటింగ్స్ పూర్తి చేసేసి ఎఫ్ 3 కి కావాల్సినన్ని డేట్స్ కేటాయించేసారు. అలాగే వరుణ్ తేజ్ కూడా అనిల్ రావిపూడికి అందుబాటులో ఉండేలా అన్ని ప్లాన్ చేసుకున్నా సెకండ్ వేవ్ ఉధృతిలో షూటింగ్ చెయ్యడం కష్టమని ఎఫ్ 3 షూటింగ్ ఆపేసారు. అయితే ఈ సెకండ్ వేవ్ ఎలా ఉన్నా ఈసారి ఎఫ్ 3 షూటింగ్ ని మొదలు పెట్టె ఏర్పాట్లలో ఎఫ్ 3 టీం ఉందట. 

ఎఫ్ 3 కోసం వేసిన భారీ సెట్ లో కరోనా కి సంబందించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎఫ్ 3 తదుపరి షెడ్యూల్ కి ప్లాన్ చేస్తుందట టీం. వచ్చేనెల అంటే జూన్ 16వ తేదీ నుంచి షూటింగుకు వెళ్లే విధంగా అనిల్ రావిపూడి అండ్ హీరోలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సారథీ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో వెంకటేశ్- వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో కొన్ని కామెడీ సీన్స్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనీ, మళ్ళీ మెహరీన్ పెళ్లి అంటూ పర్సనల్ గా బిజీ అయితే ఆమెతో షూటింగ్ కష్టమని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట.

F3 New schedule date has arrived:

F3 Movie latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ