Advertisementt

ఉప్పెన సక్సెస్ బెల్లంకొండకి కలిసొస్తుందా

Mon 17th May 2021 09:45 PM
krithi shetty,uppena beauty,bellamkonda ganesh,srinivas brother ganesh,bellakonda suresh,vivah remake  ఉప్పెన సక్సెస్ బెల్లంకొండకి కలిసొస్తుందా
Krithi Shetty to romance Bellamkonda Ganesh ఉప్పెన సక్సెస్ బెల్లంకొండకి కలిసొస్తుందా
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ని పట్టుకొచ్చి కొడుకు పక్కన హీరోయిన్ గా నిలబెట్టిన ఘనత బెల్లంకొండ సురేష్ ది. ఆ సినిమానే కాదు.. బెల్లకొండ శ్రీనివాస్ చేసిన ప్రతి సినిమాలో అతను స్టార్ హీరోయిన్స్ తోనే ఆడిపాడాడు. ఒక్క సెకండ్ సినిమాలో మాత్రం సొనారికతో తప్ప. హీరోయిన్స్ అయినా తన కెరీర్ కి హెల్ప్ అవుతారని శ్రీనివాస్ తండ్రి సురేష్ అనుకున్నాడు. కాబట్టే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ని భారీ పారితోషకాలకి పడేసి పట్టుకొచ్చాడు.

ఇప్పుడు సురేష్ చిన్నకొడుకు విషయంలోనూ అదే ప్లాన్ వర్కౌట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. బెల్లకొండ సాయి గణేష్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాని కోసం హిందీలో  మంచి హిట్ అయిన వివాహ్‌ మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకుని పవన్‌ సాదినేని దర్శకత్వంలో.. ఆ సినిమాని చేస్తున్న సురేష్.. ఇప్పుడు అదే సినిమాలో కొడుకు గణేష్ కోసం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ని తీసుకురాబోతున్నారనే టాక్ వినిపించగానే.. అందరూ అమ్మో సురేష్ మామూలోడు కాదు అంటున్నారు. ఉప్పెన తో భారీ హిట్ అందుకున్న కృతి శెట్టి కి మాములుగా క్రేజ్ రాలేదు.. ఆ తర్వాత రామ్, నాని, సుధీర్ బాబు మూవీల్లో నటిస్తూ బిజీ తారగా మారిపోయింది. 

ఇప్పుడు ఉప్పెన క్రేజ్ తో కృతి శెట్టి తో గణేష్ కనక నటిస్తే అతని ఫస్ట్ మూవీకి మంచి వెయిట్ పెరుగుతుంది అని బెల్లకొండ సురేష్ ఆలోచనగా కనిపిస్తుంది అంటున్నారు. అయితే కృతి శెట్టి ని సంప్రదించినా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?లేదా? అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా చెబుతున్నారు.

Krithi Shetty to romance Bellamkonda Ganesh:

Krithi Shetty and Bellamkonda Ganesh for Vivah remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ