తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి సినిమాల్లో నటించి తమిళంలో సెటిల్ అయిన అంజలి.. అక్కడ కూడా అనుకున్న రేంజ్ అవకాశాలు రాలేదు. అలా అలా కెరీర్ ని నెట్టుకొస్తున్న అంజలి హీరో జై తో నడిపిన ప్రేమాయణంలో బాగా హైలెట్ అయ్యింది. ఆ తర్వాత జై - అంజలి బ్రేకప్ అయ్యాక.. అంజలి గ్లామర్ గా ఉంటేనే అవకాశాలొస్తాయనుకుని.. మరీ సన్నగా తయారైంది. అంజలి సన్నబడి గ్లామర్ చూపిద్దామనుకుంటే.. ఉన్న గ్లో కూడా పోయింది. ఎట్టకేలకు అంజలికి టాలీవుడ్ వకీల్ సాబ్ తో భారీ ఆఫర్ దక్కింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అంటే ఆహా.. ఓహో అనుకున్నా.. పవర్ స్టార్ ముందు ఎవరైనా తేలిపోతారనే అనుకున్నారు. కానీ అంజలి, నివేత థామస్ ల వకీల్ సాబ్ పెరఫార్మెన్స్ ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. అంజలి కి వకీల్ సాబ్ హిట్ తో పేరొచ్చింది. అలాగే అంజలి పెరఫార్మెన్స్ ని సోలోగా మెచ్చకున్నవాళ్లూ ఉన్నారు. వకీల్ సాబ్ లో తన పాత్రకు (జరీనా) వస్తోన్న ఆదరణకు అంజలి ఆనందం వ్యక్తం చేస్తుంది. నా కెరీర్లో ఓ మైలురాయిలా వకీల్ సాబ్ నిలుస్తుంది అని.. వకీల్ సాబ్ ని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా చెప్పింది.
అయితే ఇకపై గ్లామర్ రోల్స్ కన్నా కథా బలమున్న సినిమాల్లోనే నటిస్తాను.. అంటూ ఎన్నో ఏళ్ల నుంచి తనని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మాటిస్తున్నాను అని చెబుతుంది అంజలి.