Advertisementt

కిర్రాక్ అప్ డేట్ ఇచ్చిన ఫామిలీ మ్యాన్ మేకర్స్

Mon 17th May 2021 06:14 PM
the family man season 2,samantha,manoj baypeyee,the family man season 2 trailer,the family man season 2 release date  కిర్రాక్ అప్ డేట్ ఇచ్చిన ఫామిలీ మ్యాన్ మేకర్స్
Family man season 2 trailer release date locked కిర్రాక్ అప్ డేట్ ఇచ్చిన ఫామిలీ మ్యాన్ మేకర్స్
Advertisement
Ads by CJ

ద మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. సమంత రాజి పాత్రలో నటించిన ఈ వెబ్ సీరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ సూపర్ హిట్ అవడంతో.. సీజన్ 2 పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ డేట్ విషయంలో అందరిని తెగ వెయిట్ చేయిస్తున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక వెబ్ సీరీస్ ప్రియులు ఈ సీరీస్ కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. 

అయితే ఇప్పటివరకు తెగ సస్పెన్స్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తాజాగా ఈ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్ డేట్ ఇవ్వకపోయినా.. మే 19 అంటే ఎల్లుండి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా బిగ్గెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. అంతేకాదండోయ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ రిలీజ్ కూడా జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో ఉండొచ్చు అంటూ స్వీట్ న్యూస్ చెప్పేసింది. ఇప్పటికే జూన్ 11 న ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలకు ఈ న్యూస్ మరింత ఊపునిచ్చింది. మరి టాలీవుడ్ గ్లామర్ గర్ల్ డీ గ్లామర్ రోల్ లో రాజి గా నెగెటివ్ షేడ్స్ లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ రాకకు సర్వం సిద్దమైపోయింది.

Family man season 2 trailer release date locked:

The Family Man Season 2 Trailer to be revealed on may 19th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ