గత పది రోజులుగా ఏపీలో 18 గంటల కర్ఫ్యూని అమలు చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో.. జగన్ ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూని అమలులోకి తీసుకొచ్చింది. ఉదయం ఆరుగంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఏపీలో ఆంక్షల సడలింపు ఉంది. ఆ సమయంలోనే దుకాణాలను తెరవాలని.. 12 దాటితే కేవలం అత్యవసర సేవలకు, మెడికల్ షాప్స్ కి తప్ప మిగతా వాటిని అనుమతించడం లేదు. ప్రజలు నిత్యావరసరాల కోసం మత్రమే ఇంటి నుండి బయటికి రావాలంటూ ఆంక్షలు విధించింది.
ఇక పది రోజుల కర్ఫ్యూ పూర్తి కావటంతో జగన్ ప్రభుత్వం.. తర్వాత ఏం చెబుతుందా అని ఎదురు చూస్తుంటే.. ఈ నెలాఖరు వరకు ఈ కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా కేసులు తగ్గు మొహం పట్టేవరకు ఈ కర్ఫ్యూ తప్పదని..
ఇప్పటికే పది రోజుల కర్ఫ్యూ అమలయ్యింది అని, కేసులు తగ్గాలంటే నాలుగు వరాల కర్ఫ్యూ అవసరం అని, అందుకే ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. గత పది రోజులగా ఏ ఆంక్షలైతే అమలులో ఉన్నాయో.. ఈ కర్ఫ్యులో అవే ఆంక్షలు అమలవుతాయని జగన్ చెప్పారు.