రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చెయ్యబోయే దర్శకుడి విషయంలో చాలా పేర్లు వినిపించిన చివరికి కోలీవుడ్ ట్రోపీ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా ఫిలిం ని ప్రకటించాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కాల్ గా ఉండే ఫ్యామిలీ కథతో రామ్ చరణ్ టాలీవుడ్ డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇస్తాడని అనుకున్న.. రామ్ చరణ్ మాత్రం శంకర్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించి షాకిచ్చాడు. అది కూడా దిల్ రాజు నిర్మాతగా. అయితే రామ్ చరణ్ - శంకర్ మూవీ జులై ఆర్ ఆగస్టు నుండి సెట్స్ మీదకెళ్లాల్సి ఉండగా.. దర్శకుడు శంకర్ కి ఇండియన్ 2 షూటింగ్ వ్యవహారం కోర్టు దాక వెళ్లడంతో ఇప్పుడు శంకర్ - రామ్ చరణ్ మూవీ మొదలు కావడానికి మరో ఆరు నెలలు సమయం పైనే పడేలా ఉంది. అంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ కి భారీ గ్యాప్ తప్పేలా కనిపించడం లేదు.
ఇక రామ్ చరణ్ కి కూడా ఇంత గ్యాప్ తీసుకోవడం అవసరం? లేదంటే మెట్రో మూవీకి కమిట్ అయితే మళ్ళీ శంకర్ ఫ్రీ అయిపోతే కష్టం? ఒకవేళ మళ్ళీ మరో సినిమాకి కమిట్ అవ్వాలంటే పాన్ ఇండియా మూవీ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీగా లేరు. అంటే ఇప్పుడు పాన్ ఇండియా ని పక్కనబెట్టి మాములు రేంజ్ సినిమా చెయ్యాలా? ఈ ఆరు నెలల గ్యాప్ లో ఎలాంటి సినిమా చేస్తే బావుంటుంది? అసలు చెయ్యడం అవసరమా? శంకర్ కోసం వెయిట్ చేస్తే పోలా? ఇలా రకరకాల ఆలోచనలతో రామ్ చరణ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడట.