కరోనా సెకండ్ వేవ్ కేవలం సామాన్య ప్రజలనే కాదు.. చాలామంది సెలబ్రిటీస్ ని తన పంజాతో కబళిస్తుంది. ఒకే ఫ్యామిలిలో చాలామందిని బలిగొంటుంది. ఇష్టమైన వ్యక్తులని తీసుకుపోతుంది. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా తో పోరాడుతుంది. కరోనా కారణంగా ఆత్మీయులని కోల్పోతున్న వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారిలో హీరోయిన్ పాయల్ రాజపుట్ కూడా ఉంది. RX 100 ఫేమ్ పాయల్ రాజ్ ఫుట్ ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనిత రీసెంట్ గా కరోనా కారణంగా కన్ను మూశారు. దానితో పాయల్ రాజ్ ఫుట్ సోషల్ మీడియాలో కన్నీటిపర్యంతమవడమే కాదు.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
పాయల్ రాజ్ కొన్నాళ్లుగా సౌరభ్ డింగ్రా ప్రేమలో ఉంది. అలాగే సౌరభ్ డింగ్రా ఫ్యామిలితోను పాయల్ చాలా చనువుగా ఉండేది. సౌరభ్ డింగ్రా తల్లి అనిత మరణించడంతో ఎమోషనల్ అయిన పాయల్.. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ మనసులో మీకెప్పటికీ స్థానం ఉంటుంది. కరోనా నుంచి బయటపడేందుకు ఎంతో పోరాడారు. అనిత ఆంటీ మిమ్మల్ని మేము ఎంతో మిస్ అవుతున్నాం. మా అమ్మలానే మీరు కూడా నాపై ప్రేమ చూపించేవారు. మీ మరణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పాయల్ రాజపుట్.