ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ ని దర్శకుడు ఓం రౌత్ ఒక యజ్ఞం లా మొదలు పెట్టాడు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ లతో ఆదిపురుష్ ని మొదలు పెడదామనుకునేలోపు ఆదిపురుష్ సెట్ తగలబడడం, తర్వాత అన్ని సర్దుకుని షూటింగ్ మొదలు పెట్టగా చిన్న చిన్న ఆటంకాలు, అలాగే అన్ని సెట్ అయ్యి షూటింగ్ సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయానికి కరోనా సెకండ్ వేవ్ తో మహారాష్ట్రలో జనతాకర్ఫ్యూ తో షూటింగ్స్ అన్ని వాయిదా పడడంతో ఆదిపురుష్ కూడా ఆపాల్సి వచ్చింది. తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ అనుకుంటున్న టైం లో ఇక్కడ తెలంగాణాలో లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది.
అయితే ఇన్ని ఆటంకాలు అనేది రామాయణంలో ఉన్నట్లే ఇక్కడ ఆదిపురుష్ సినిమా విషయంలోనూ జరుగుతుంది అని టీం మొత్తం అలోచించి ఈసారి మళ్ళి ఆదిపురుష్ షూటింగ్ మొదలయ్యే సమయానికి కాస్త పూజలు గట్రా నిర్వహిస్తే మంచిది అని నిపుణుల సలహా మేరకు దర్శకుడు ఓం రౌత్ అండ్ ఆదిపురుష్ టీం కూడా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చెయ్యాలని రెడీ అవుతుందట. 300 కోట్లతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఆదిపురుష్ కి మళ్ళీ షూటింగ్ మొదలయ్యాక ఎలాంటి ఆటంకాలు కలగకూడదని.. ఇప్పుడు ఈ లాక్ డౌన్ టైం లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అన్ని సెట్ చేసుకుంటున్నారట. ప్రభాస్ డేట్స్ సరిగ్గా వాడుకోవాలి కనక ఆమేరకు ఏర్పాట్లు చెయ్యాలని డిసైడ్ అయ్యారట. మరి ప్రభాస్ కూడా ఆదిపురుష్ - సలార్ ప్రాజెక్ట్స్ ని పారలల్ గా చెయ్యాలి.