స్రవంతి రవి కిషోర్ తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో పడుతూ లేస్తూ హీరోగా నిలదొక్కుకున్నాడు. 2006 లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు మూవీ తో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత నిన్నమొన్నటి రెడ్ మూవీ వరకు రామ్ కెరీర్ లో ప్లాప్ లు ఉన్నాయి.. హిట్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. రెడీ, నేను శైలజ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ లా పేరు తెచ్చుకున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ అవతారమెత్తాడు. ఇస్మార్ట్ హిట్ తో మాస్ ఫాన్స్ మనసులు దోచేశాడు.
ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా ప్రాజెక్ట్ అయిన రామ్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరాయి. కానీ రెడ్ తో రామ్ అనుకున్న హిట్ అందుకోలేకపోయాడు. ఇస్మార్ట్ శంకర్ తో అవార్డులు కొల్లగొట్టిన రామ్ రెడ్ మూవీ తో ఢీలా పడిపోయాడు. ఇక తాజాగా తమిళ దర్శకుడు లింగు స్వామితో రామ్ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న రామ్ లేటెస్ట్ మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణముగా వాయిదా పడింది. ఇక రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తున్నాడు.
ఇండస్ట్రీలో ఒద్దికగా ఉండే హీరోల్లో రామ్ ఒకడు. నేడు రామ్ బర్త్ డే సందర్భంగా సినిమా ప్రముఖులంతా రామ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు బర్త్ డే జరువుకుంటున్న హీరో రామ్ కి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.