యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్టీఆర్ ఫాన్స్ కి ఉత్సాహం, ఆత్రుత పెరిగిపోతుంది. గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మిస్ అయినందుకు ఎంతగానో ఫీల్ అయ్యారు ఎన్టీఆర్ ఫాన్స్. RRR నుండి ఎలాంటి హడావిడి లేని కారణంగా డిస్పాయింట్ అయ్యారు. రాజమౌళి ఎన్టీఆర్ బర్త్ డే కి డిస్పాయింట్ చేసినా తర్వాత కొమరం భీం టీజర్ తో ఫాన్స్ కి భీభత్సమైన ట్రీట్ ఇచ్చేసాడు. ఇక ఈ బర్త్ డే కి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా ఆర్.ఆర్.ఆర్ నుండి రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో టీజర్ ని కూడా వదలబోతున్నట్లుగా టాక్ ఉంది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా NTR30 దర్శకుడు కొరటాల కాన్సెప్ట్ పోస్టర్ వదలడం కాదు.. NTR30 హీరోయిన్ ని పరిచయం చేయబోతున్నారట. ఎన్టీఆర్ - కొరటాల కలయికలో NTR30 గా తెరకెక్కుతున్న సినిమాకి కియారా అద్వానీ హీరోయిన్ గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది అని, ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే రోజున కియారా పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. మరి అటు ఆర్.ఆర్.ఆర్ నుండి ఇటు కొరటాల మూవీ నుండి ఎన్టీఆర్ ఫాన్స్ కి డబుల్ ట్రీట్స్ అందుతున్నాయి. గత ఏడాది సింగిల్ సెలెబ్రేషన్స్ మిస్ అయినా ఈ ఏడాది డబుల్ సెలెబ్రేషన్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ అల్లాడించడం ఖాయం. ఇప్పటికే సోషల్ మీడియాలో #JaiNTR హాష్ టాగ్ ని ప్రతి రోజు ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్.