తెలుగులో అవకాశాలు లేకపోతేనేమి, రాకపోతేనేమి.. బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో మరో రెండేళ్లు డైరీ ఫుల్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లోనూ స్టార్ హీరోలందరితో చేసింది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా పేరున్న హీరోలందరితో నటించింది. ఒకప్పుడు స్టార్ డం ని బాగా ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ ని టాలీవుడ్ పక్కనబెట్టినా బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. అయితే అభిమానులు నవ్వుతూ మీరు నటించిన ఆ సినిమా బావుంది, ఈ సినిమా బావుంది అంటూ పలకరించినప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తుంది అని, ఫాన్స్ దగ్గర స్మైల్ చూస్తే ఎంతైనా కష్టపడి పని చెయ్యాలనిపిస్తుంది అంటుంది రకుల్.
నా స్టార్ డం ఏమైపోతుందో అనే భయం నాకు లేదు. అలా అనుకోకుండా ముందుకు వెళ్లడమే నా సక్సెస్ కి మెయిన్ రీజన్ అని చెబుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి నేను ఎవరో తెలియదు. నాకు ఎలాంటి పేరు లేదు. కానీ నా లక్కుని బట్టి చాలామందికి దొరకని అవకాశాలు నాకు దొరికాయి. వాటితో నా డ్రీం ని నెరవేర్చుకున్నాను. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమే నన్ను కొత్త పాత్రలవైపు అడుగులు వేసేలా చేసింది. అంటూ ఫాన్స్ కి రకుల్ థాంక్స్ చెబుతుంది.