Advertisementt

బర్త్ డే స్పెషల్: అనసూయ అలా. అలా..

Sat 15th May 2021 06:17 PM
anasuya,anasuya bharadwaj,anasuya birthday special,anasuya birthday,anasuya burthday news,anasuya stills,anasuya images  బర్త్ డే స్పెషల్: అనసూయ అలా. అలా..
Anasuya Birthday Special బర్త్ డే స్పెషల్: అనసూయ అలా. అలా..
Advertisement
Ads by CJ

బుల్లితెర గ్లామర్ యాంకర్ గా ఐటెం సాంగ్స్ కి స్పెషల్ గా, వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్ట్ గా వెలిగిపోతున్న అనసూయ పుట్టిన రోజు నేడు. ఇక బుల్లితెర మీద, వెండితెర ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనసూయ గ్లామర్ కి పెళ్లి, పిల్లలు అడ్డం పడలేదు. పెళ్లి తర్వాత కెరీర్ కి ఫుల్ స్టాప్ అనుకుంటే అనసూయ ని చూసి ప్లాన్ చేసుకోవాల్సిందే. మంచి ఫిగర్ మెయింటింగ్ చేస్తూ అనసూయ ఇప్పటికి హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ ఫొటో షూట్స్ కి వేలల్లో అభిమానులున్నారు. అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించింది అంటే స్టేజ్ దడదడే. పెళ్లికాని రష్మీ ముందు పెళ్లైన అనసూయ ఇప్పటికి గ్లామర్ గా అదరగొట్టేస్తుంది. 

పర్సనల్ లైఫ్ లో భరద్వాజ్ ని తొమ్మిదేళ్లు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లాడిన అనసూయకి ఇద్దరు అబ్బాయిలు. అనసూయ ప్రోగ్రామ్స్ తో షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పుడు తమ పిల్లలని ఆమె భర్త భరద్వాజే చూసుకుంటారని అనసూయ గర్వంగా చెబుతుంటుంది.

అలాగే అనసూయ అటు వెండి తెర మీద లక్కుని టెస్ట్ చేసుకుంటుంది. క్షణం, కథనం, థాంక్యూ బ్రదర్ వంటి చిత్రాల్లో ఫీమేల్ లీడ్ లో నటించిన అనసూయకి ఆ సినిమాలు జస్ట్ ఓకె అనిపించే రిజల్ట్ ఇచ్చాయి. ఇక అటు ఐటెం సాంగ్స్ లోను అనసూయ డాన్స్ స్టెప్స్ కి మంచి క్రేజ్ ఉంది. మరోపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలతో అనసూయ బిజినే. అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిలిం పుష్పలో కీలక పాత్ర చేస్తున్న అనసూయ అదే సుకుమార్ దర్శకత్వంలో రంగమ్మత్తగా పదికాలాలు నిలిచిపోయే కేరెక్టర్ లో మెరిసింది. 

ఇక రవి తేజ ఖిలాడీలో అనసూయ నెగెటివ్ షేడ్స్ ఉన్నకేరెక్టర్ లో కనిపిస్తుంది అనే టాక్ ఉంది. ఇవి కాకుండా అనసూయ అటు మలయాళం, ఇటు తమిళ మూవీస్ కి సైన్ చేస్తుంది. మరి పెళ్లి తర్వాత కూడా అనసూయ ఆలా. ఆలా.. ఓ రేంజ్ లో కెరీర్ ని సెట్ చేసుకుంటున్న అనసూయకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలిందే. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అనసూయ భరద్వాజ్ కి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Anasuya Birthday Special:

Anasuya Birthday Special news

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ