ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ ని వాయిదా వెయ్యడానికి ఏపీ ప్రభుత్వం ఎంతగా ఆలోచించిందో.. కరోనా సెకండ్ వేవ్ ని కూడా లెక్కచెయ్యమని అన్న విషయం అందరూ చూసారు. లాస్ట్ మినిట్ వరకు ఇంటర్ విద్యార్థులని బెంబేలెత్తించింది ఏపీ ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అలాగే ఏపీ సీఎం జగన్ ఇద్దరూ విద్యార్థుల భవిష్యత్తు దృశ్యా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామంటూ హంగామా చేసారు. ఆఖరికి ఈ ఇంటర్ ఎగ్జామ్స్ విషయం కోర్టుకి చేరడంతో చివరికి ఏపీ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వెయ్యక తప్పలేదు. అది కూడా ఇంటెర్ ఎగ్జామ్స్ కి ముందు అంటే ఓ నాలుగు రోజుల ముందు పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ వలన ఏపీ లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న టైం లో మళ్లీ 10 పరీక్షల అనుకున్న డేట్ కే జరుగుతాయంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తు దృశ్యా 10 పరీక్షలు షెడ్యుల్ ప్రకారం జూన్ 7 నుండే జరుగుతాయని, కరోనా నిభందనలు పాటిస్తూ విద్యార్థులకి పరిక్షలు నిర్వహిస్తామని సురేష్ చెబుతున్నారు. ఇంటర్ విద్యార్థులని కన్ఫ్యూజ్ చేసినట్టుగా చివరివరకు 10 విద్యార్థులని కూడా కన్ఫ్యూజ్ చేసి పిల్లలని టెంక్షన్ పెడతారా అంటూ ఏపీలో పదవ తరగతి విద్యార్థుల పేరెంట్స్ కంగారు పడుతున్నారు.