తెలుగులో 1 నేనొక్కడినే, దోచేయ్ సినిమాల తర్వాత అవకాశాలు రాక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడే సెటిల్ అయిన కృతి సనన్ కి బాలీవుడ్ లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో సీత పాత్రలో నటిస్తుంది. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ ని ఓం రౌత్ దర్శకత్వం వహించడం ఒక ఎత్తైతే.. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవడం మరో ఎత్తు. ప్రభాస్ తో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కృతి సనన్ చాలా ఎగ్జైట్ అవుతుంది. అయితే ఇప్పుడు కృతి సనన్ కి తెలుగులో తెరకెక్కబోయే మరో పాన్ ఇండియా మూవీ అవకాశం వచ్చినట్లుగా టాక్. ప్రభాస్ తో నటిస్తున్న కృతి సనన్ రేంజ్ పెరిగిపోవడంతో ఇప్పుడు దర్శకుల చూపు ఆమెపై పడింది.
అందులోనూ టాలీవుడ్ కృతి సనన్ ని మహేష్ బాబు హీరోగా 1 నేనొక్కడినే మూవీతో పరిచయం చేసిన సుకుమార్ తన నెక్స్ట్ మూవీ కోసం కృతిని సెలెక్ట్ చేసుకోబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. సుకుమార్ పుష్ప తర్వాత విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా ఫిలిం కి కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఆ మూవీ కోసం విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసే పనిలో సుకుమార్ ఉన్నాడంటున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో ఉంది.. ఇప్పుడు విజయ్ తో నిజంగా అవకాశం దక్కితే కృతి సనన్ అదృష్టం చేసుకున్నట్టే. మరి వరస పాన్ ఇండియా ఫిలిం స్ తో కృతి సనాన్ కెరీర్ లో జోష్ పెరిగినట్లే.