సెకండ్ వేవ్ స్టార్ట్ అవడమే సీనియర్ హీరోలంతా ఇంటి కే పరిమితమయ్యారు. చిరు ఆచార్య షూటింగ్ ఆపేసారు. నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబో కి బ్రేకు లు పడ్డాయి. ఇక వెంకటేష్ నారప్ప, దృశ్యం 2 మూవీ షూటింగ్స్ ఫినిష్ చేసి ఎఫ్3 ని పక్కనబెట్టారు. బాలకృష్ణ మాత్రం నిన్నమొన్నటివరకు అఖండ మూవీ షూటింగ్ చేసారు. బోయపాటి దర్శకత్వంలో BB3 గా తెరకెక్కుతున్న అఖండ మూవీ షూటింగ్ ని బాలకృష్ణ సెకండ్ వేవ్ ఉన్నాసరే బెదరకుండా చాలావరకు కంప్లీట్ చేసేసారు. మరి మరో పది రోజుల్లో అఖండ కి రిలీజ్ డేట్ ఉంది. ప్రస్తుతం థియేటర్స్ మూత బడడంతో అఖండ కూడా వాయిదా పడాల్సిందే.
అఖండకి సంబంధించిన షూటింగ్ మరో 15 నుండి 20 రోజులు చేస్తే ఫినిష్ అవుతుందట. అసలైతే ఈపాటికి షూటింగ్ పూర్తవ్వాల్సి ఉన్నా.. సినిమా ఎలాగూ పోస్ట్ పోన్ అవుతుంది అందుకే కాస్త గ్యాప్ ఇస్తూ షూటింగ్ చేస్తున్నారట. నిన్న కొత్త షెడ్యూల్ మొదలవ్వాలి కానీ.. కరోనా భీభత్సంతో అది వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. లేదంటే ఈపాటికి లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యేది అంటున్నారు. అది చూసి బాలయ్య నువ్వు మాములోడివి కాదయ్యా అందుకే ఇంత ఫాస్ట్ గా అఖండ మూవీ షూట్ ని కంప్లీట్ చేసేస్తున్నావ్ అంటున్నారు బాలయ్య ఫాన్స్. మరి BB3 అఖండ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.