Advertisementt

బాలయ్య మిస్.! పవన్ కి ప్లస్..!

Sat 15th May 2021 11:42 AM
pawan kalyan,first choice,dil raju,balakrishna,vakeel saab movie,nandamuri balakrishna  బాలయ్య మిస్.! పవన్ కి ప్లస్..!
Pawan not the first choice for Vakeel Saab బాలయ్య మిస్.! పవన్ కి ప్లస్..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ని మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు వకీల్ సాబ్ మూవీ పర్ఫెక్ట్ కం అనిపించింది. ఏప్రిల్ 9 న థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ కి కరోనా కరుణించినట్లయితే రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టేదే. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత కూడా ప్రేక్షకులకు నచ్చేలా కనిపించడం, పెరఫార్మెన్స్, ప్రకాష్ రాజ్, అంజలి, నివేత కలెరెక్టర్స్ అన్ని ఈ సినిమాని బ్లాక్ బస్టర్ వైపు నడిపించాయి. దిల్ రాజు ముందుగా పవన్ కి పింక్ రీమేక్ చేద్దామని అడిగాడు ఆయనకి త్రివిక్రమ్ హెల్ప్ చేసినట్లుగా చెప్పాడు. త్రివిక్రమ్ ఒప్పించబట్టే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ చేసాడు.

అయితే దిల్ రాజు - వేణు శ్రీరామ్ ల వకీల్ సాబ్ ఫస్ట్ ఛాయస్ పవన్ కళ్యాణ్ కాదట. పింక్ కథ ముందుగా నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లిందట. దిల్ రాజు బాలయ్య తో ఎప్పటినుండో మూవీ చేయాలనుకుంటున్నాడు. అందుకే బాలకృష్ణ దగ్గరకి పింక్ కథని తీసుకెళ్లగా.. కథ విన్న బాలకృష్ణ అంతగా ఆసక్తిని చూపలేదట. ఆ తర్వాత త్రివిక్రమ్ సహాయంతో పవన్ ని కలవడం ఆయన ఓకె చెప్పడం జరిగిపోయాయి. బాలయ్య మిస్.! పవన్ కి ప్లస్..! అని ఒకవేళ వకీల్ సాబ్ ని బాలయ్య చేసివుంటే.. అనే చర్చ నందమూరి ఫాన్స్ లో మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వకీల్ సాబ్ ని బాలయ్య మిస్ చేసుకున్నాడని అనుకుంటున్నారు.

Pawan not the first choice for Vakeel Saab:

Pawan Kalyan was not the first choice for Vakeel Saab

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ