బాలీవుడ్ లో దిశా పటాని అందాలు సోషల్ మీడియా కి కొత్త కాదు. దిశా పటాని జిమ్ వెర్ అయినా.. ఎలాంటి డ్రెస్ అయినా ఆమె అందాలను అరోబోయ్యడంలో కూడా స్పెషల్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఎంతగా గ్లామర్ షో చేసినా దిశా పటాని కి స్టార్ ఛాన్సెస్ రావడం చాలా తక్కువ. దీపికా, కియారా అద్వానీ టైప్ లో దిశా పటానికి అవకాశాలు రాలేదు. టైగర్ షెరిఫ్ తో ప్రేమాయణం నడుపుతున్న దిశా పటానికి సల్మాన్ ఖాన్ రాధే మూవీ లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో దిశా పటాని అందాల గురించి మాట్లాడుకోవడం తప్ప ఆమె చేసింది ఏది లేదు. అంటే పెరఫార్మెన్స్ కి స్కోప్ తక్కువ ఉన్న కేరెక్టర్ అది. కేవలం సాంగ్స్ లో గ్లామర్ షో తప్ప మరేదీ లేదు.
అయితే ఇప్పుడు ఆమె గ్లామర్ షో ఆమెకి అవకాశాలు తెచ్చేలా కనిపిస్తుంది. టాలీవుడ్ సీటిమార్ సాంగ్ లో దిశా స్టెప్స్, దిశా గ్లామర్ చూసాక అల్లు అర్జున్ ఆమెపై మనసు పారేసుకున్నాడట. అందుకే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఎలాగైనా దిశా ని పట్టుకురమ్మని సుకుమార్ కి చెప్పినట్టుగా టాక్ నడుస్తుంది. దిశా పటాని డాన్స్ స్టెప్స్, ఆమె అందాలు పుష్ప కి పాన్ ఇండియా లెవల్లో హెల్ప్ అవుతాయని.. అందుకే దిశా పటాని కి ఎన్ని కోట్లయినా ఇచ్చి తీసుకోమని బన్నీ చెబుతున్నాడు. గతంలో దిశా పటానికి అడిగితే ఆమె ఎక్కువ డిమాండ్ చేసిన కారణంగా ఉర్వశి రౌతెల్లని తీసుకున్నారనే టాక్ నడిచినా.. ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం దిశనే కావాలంటున్నాడట.