తెలుగులో కొరియోగ్రాఫర్ స్థాయి నుండి దర్శకుడిగా తనని తాను నిరూపించుకుని తమిళంలో లేడి సూపర్ స్టార్ నయనతార తో లవ్ ఎఫ్ఫైర్ నడిపి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ దర్శకుడిగా మారిపోయి ముంబైగా లో ఉండిపోయిన ప్రభుదేవా కి ఈమధ్యన దర్శకుడిగా సక్సెస్ కాలేక నానా తంటాలు పడుతున్నాడు. పోకిరి, విక్రమార్కుడు లాంటి సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టిన ప్రభుదేవా కి తర్వాత చేసిన సినిమాలేవీ సక్సెస్ ని ఇవ్వలేదు. అంతెందుకు సల్మాన్ ఖాన్ తో రాధే కన్నా ముందు తీసిన దబాంగ్ 3 డిజాస్టర్. అయినా సల్మాన్ ఖాన్ రాధే కి అవకాశం ఇచ్చాడు. మరి రాధే కి ప్రభుదేవా న్యాయం చేశాడా అంటే.. అమ్మో రాధే చూసినవాళ్లు బాబూ ప్రభుదేవా.. ఏంటిది అని అడుగుతున్నారు.
అంటే సల్మాన్ ఖాన్ రాధే అలా ఉందన్నమాట. ఈద్ కానుకగా జీ ప్లెక్స్ లో విడుదలైన రాధే మూవీ కేవలం సల్మాన్ ఖాన్ అభిమానులకి తప్ప మరెవ్వరికీ ఎక్కదు. రాధే మూవీ రొటీన్ రోడ్డ కొట్టడిలా ఉంది, సల్మాన్ లుక్స్ పరంగా తేలిపోయాడు, కేవలం సల్మాన్ కోసం సినిమా తీసినట్టుగా, యాక్షన్ సన్నివేశాలు, హీరోయిజం తప్ప మరేదీ లేదు. ఎంత వెతికినా కొత్తదనం అన్నదే కనిపించలేదు, అమ్మో ఆ దిశా ఏంటండీ.. కేవలం అందాలు ఆరబొయ్యడానికే ఈ సినిమా చేసిందా? పెద్ద హీరో అంటే ఇలా ఒప్పేసుకుంటారా? ప్రభుదేవా నువ్విక డైరెక్షన్ ఆపేయ్. అసలు ఈ కథని సల్మాన్ ఖాన్ ఎలా ఒకే చేసాడబ్బా? అంటే సల్మాన్ లో పస అయ్యిపోయిందా? అందుకే ఇలాంటి కథని ఒకే చేసేసాడు?
అసలు ఫాన్స్ కైనా ఈ సినిమా నచ్చుతుందా? అమ్మో నెటిజెన్స్ వేసే ప్రశ్నలకి సమాధానాలు దొరకడం కష్టంగా కనిపిస్తుంది. ప్రభుదేవా నువ్విక డైరెక్షన్ వదిలేయ్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క రాధే కి సోషల్ మీడియా సెగ. నేపోటిజం పై దండెత్తుతున్ననెటిజెన్స్ #BoycottRadhe హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అదో డ్యామేజ్. దెబ్బకి ప్రభుదేవాకి ఛాన్స్ ఇస్తే ఆ హీరో మహానుభావుడే అంటే.. ఇక ప్రభుదేవా కెరీర్ మటాష్ అన్నమాటే.