కరోనా క్రైసిస్ తో లాక్ డౌన్ మొదలైంది. థియేటర్స్ మూత బడ్డాయి. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియనప్పుడు ఓటిటిలు కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు ఎగబడి దర్శకనిర్మాతలను ఒప్పించి సినిమాలు కొనేసాయి. అయితే అప్పుడు చాలా సినిమాలు ఓటిటిలో హిట్ అయిన దాఖలాలు లేవి. మళ్ళీ థియేటర్స్ కి పూర్వ వైభవం వస్తుంది అనుకున్న టైం లో థియేటర్స్ మరోసారి సెకండ్ వేవ్ తో మూత బడ్డాయి. మళ్ళీ ఓటిటీలు రెడీ అయ్యాయి. రిలీజ్ కి సిద్దమైన సినిమాలు కొనేందుకు ఓటిటీలు తమ ప్రయత్నాలు స్టార్ట్ చేసాయి. లవ్ స్టోరీ, విరాట పర్వం ఇలా కొన్ని సినిమాలపై ఓటిటీల కన్ను పడింది.
తాజాగా రానా - సాయి పల్లవి ల కాంబోలో తెరకెక్కిన విరాట పర్వం మూవీకి ఓటిటి నుండి భారీ ఆఫర్ వెళ్ళింది అని, త్వరలోనే విరాట పర్వం ఓటిటిలో రిలీజ్ కాబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి అని. అసలు థియేట్రికల్ రైట్స్ ని బయ్యర్లకు అమ్మేశాక మళ్ళీ ఓటిటికి ఎలా అమ్ముతారు అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు. విరాట పర్వం ఎట్టి పరిస్థితుల్లో ఓటిటికి అమ్మేది లేదంటున్నారు. సాయి పల్లవి పెరఫార్మెన్స్, రానా నక్సలైట్ లుక్ అన్ని కలిసి సినిమాపై మంచి అంచనాలుండడంతో ఓటిటి లు ఎలాగైనా విరాట పర్వం మూవీని దక్కించుకోవాలని కాచుకుని కూర్చున్నాయి.