బాలకృష్ణ ఇటు మూవీ షూటింగ్స్ తోనూ అటు రాజకీయాలతో ఎప్పుడూ బిజినె. మొన్నీమధ్యన పంచాయితీ ఎలక్షన్స్ లో యాక్టీవ్ గా ఉన్న బాలయ్య.. నిన్నమొన్నటివరకు అఖండ మూవీ షూటింగ్స్ లో డేర్ గా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఏపీ మొత్తం కరోనా పేషేంట్స్ విషయంలో అల్లాడుతోంది.. జగన్ ప్రభుత్వం ఆక్సిజెన్ సరఫరాలో తలమునకలై ఉంది. నిన్నగాక మొన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజెన్ అందక చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక కొన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజెన్, బెడ్స్ కోసం పేషేంట్స్ నానా తంటాలు పడుతున్నారు. అయితే హిందూపూర్ ఎమ్యెల్యే బాలకృష్ణ తన సొంత డబ్బుతో కరోనా పేషేంట్స్ ని కాపాడుతున్నారు.
కరోనా బారినపడిన వారికీ ఉచితంగా మందులు పంపిణి చెయ్యడం, వారికీ ఏయే మందులు కావాలో అన్ని ప్యాక్ చేసి మరీ బాలయ్య ప్రత్యేక వాహనాల్లో పంపించడం హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య నియోజక వర్గం హిందూపురంలో కరోనా కేసులు భయంకరంగా ఉండడం, కొన్ని రోజుల క్రితం ఆక్కడ హాస్పిటల్స్ లో ఆక్సిజెన్ అందకపోవడం, ప్రభుత్వం సకాలంలో మందులు పంపిణి చేయలేకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో బాలకృష్ణ రంగంలోకి దిగారు. గత ఏడాది కరోనా టైం లో 50 లక్షలు ఖర్చు పెట్టి ఆధునిక పరికరాలను కొన్న బాలయ్య ఈసారి మాత్రం పేషేంట్స్ కే నేరుగా మందులు పంపిణి చేపట్టారు.
దానితో బాలయ్య ఫాన్స్ అంతా అఖండ కరోనా బాధితులకి అండ అంటూ ఉత్సాహంగా బాలయ్య హెల్ప్ చేసిన విషయాన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.