Advertisementt

సూపర్ స్వీటీ కాదు.. అమ్మో స్వీటీ

Thu 13th May 2021 08:48 PM
anushka shetty,social media look,anushka new look,goes viral,internet  సూపర్ స్వీటీ కాదు.. అమ్మో స్వీటీ
Anushka latest look viral సూపర్ స్వీటీ కాదు.. అమ్మో స్వీటీ
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సూపర్ సినిమాతో స్వీటీ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి.. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజ్ ని ఎంజాయ్ చేసింది.  అనుష్క- ప్రభాస్ కలయికలో సినిమా అనగానే వాళ్ళ పెయిర్ పై బోలెడన్ని అంచనాలు ఉండేవి. సీనియర్ హీరోలైన నాగ్, బాలయ్య లతో కూడా నటించిన అనుష్క కి బాహుబలి మూవీ తో మంచి క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో అనుష్క ఫేమ్ సొంతం చేసుకుంది. బాహుబలి వరకు మంచి ఫిజిక్ మెయింటింగ్ చేసిన అనుష్క ఉన్నట్టుండి బరువు పెరిగింది. సైజు జీరో కోసం అనుష్క చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. ఆ సినిమా తర్వాత అనుష్క బాగా బరువు పెరిగి గ్లో కోల్పోయింది.

ఆ తర్వాత సన్నబడడానికి ఉన్న మార్గాలన్నీ అనుష్క అనుసరించింది. అనుష్క యోగ, జిమ్ అబ్బో చాలానే చేసింది. ఆఖరుకి ఆయుర్వేదం కూడా ట్రై చేసినా ఫలితం సూన్యం. అనుష్క - మాధవన్ కాంబోలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమాలో అనుష్క ఫిజిక్ మీద, లుక్స్ పై చాలా కామెంట్స్ వచ్చాయి. నిశ్శబ్దం తర్వాత మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది అనుష్క. సినిమాలు ఒప్పుకోవడం లేదో.. ఆమెని ఎవరూ సంప్రదించడం లేదో కానీ  అనుష్క ప్రస్తుతం ఖాళీ. గత ఏడాది నిశ్శబ్దం అప్పుడు కనబడిన స్వీటీ మళ్ళీ ఇన్నాళ్ళకి సోషల్ మీడియాలో కనిపించి షాకిచ్చింది. స్వీటీగా స్వీట్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ని ప్రస్తుతం పైన ఉన్న లుక్ లో చూడగానే అమ్మో  అనుష్క.. ఏమిటి లుక్ అనేస్తారు. బాగా బరువు పెరిగి అవుట్ అఫ్ గ్లామర్ లో కనిపిస్తుంది అనుష్క. 

Anushka latest look viral:

Anushka Shetty new look goes viral on Internet 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ