Advertisementt

చెక్కులకి లొంగని హీరోయిన్

Thu 13th May 2021 08:10 PM
sai pallavi,bellamkonda srinivas,bellamkonda suresh,chatrapathi remake,vinayak,sai pallavi rejects offer,crores  చెక్కులకి లొంగని హీరోయిన్
Sai Pallavi rejects another offer చెక్కులకి లొంగని హీరోయిన్
Advertisement
Ads by CJ

తెలుగులో రాజమౌళి.. ప్రభాస్ హీరోగా మాస్ ఎంటర్టైనర్ గా ఛత్రపతి సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అదే సినిమాని బాలీవుడ్ లో బెల్లంకొండ, వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చెయ్యబోతున్నాడు. ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కాబట్టి అక్కడి ప్రేక్షకుల అటెంక్షన్ కోసం బెల్లంకొండ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు. అలాగే బెల్లంకొండకి బాలీవుడ్ యూట్యూబ్ లో భీభత్సమైన క్రేజ్ ఉంది. అంటే బెల్లంకొండ నటించిన జయజానకి నాయక మూవీ హిందీ యూట్యూబ్ లో భీభత్సమైన లైక్స్ తెచ్చుకోవడంతో బెల్లంకొండకి బాలీవుడ్ పై మోజు పుట్టింది. 

అయితే తెలుగులో ఎలా అయితే టాప్ హీరోయిన్స్ ని అడ్డం పెట్టుకుని సినిమాలకు క్రేజ్ తెచ్చకున్నాడో.. అదే ఫార్ములాని బెల్లకొండ బాలీవుడ్ లో కూడా ప్లే చేద్దామనుకున్నారు. ఇక్కడ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ బెల్లంకొండ సురేష్ చెక్కులకి పడిపోయినా.. బాలీవుడ్ భామలెవరూ బెల్లంకొండ చెక్కులకి పడకపోయేసరికి.. బెల్లకొండ కి తమిళ, తెలుగు, మలయాళంలో ఫేమ్ ఉన్న సాయి పల్లవి కోసం ట్రై చేస్తున్నారట. కానీ సాయి పల్లవి కూడా చెక్కులకి లోంగే హీరోయిన్ కాదు. అందుకే బెల్లంకొండ కి నో చెప్పింది అనే టాక్ నడుస్తుంది. ఛత్రపతి లో శ్రీయ చేసిన రోల్ కి సాయి పల్లవి ని అడుగుతున్నారు బెల్లకొండ బ్యాచ్. కానీ సాయి పల్లవి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట.

Sai Pallavi rejects another offer:

Sai Pallavi rejects offer worth crores

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ