అసలైతే ఈరోజు మెగా ఫాన్స్ కి పండగ రోజు, ఖైదీ నెంబర్ 150, సై రా నరసింహ రెడ్డి సినిమాల తర్వాత మెగాస్టార్ చిరు నటిస్తున్న ఆచార్య మూవీ మే 13 న రిలీజ్ కి డేట్ ఇచ్చారు. కరోనా లాక్ డౌన్ ముగిసాక ఆచార్య షూటింగ్ జరుగుతున్నప్పుడే.. మే 13 ఆచార్యని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా కొరటాల శివ - చిరు లు డేట్ అనౌన్స్ చేసారు. అలాగే దానిలో భాగంగా ఆచార్య మూవీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు. ఆచార్య టీజర్, రామ్ చరణ్ సిద్ద లుక్, పూజ హెగ్డే నీలాంబరి లుక్, ఆచార్య సాంగ్ ఇలా ఆచార్య ప్రమోషన్స్ చేసారు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. అలాగే థియేటర్స్ మూత బడడంతో ఆచార్య సినిమాని పోస్ట్ పోన్ చేసేసారు.
లేదంటే మెగాస్టార్ చిరు ఆచార్య మూవీ ఈపాటికి థియేటర్స్ లో సందడి చేసేది. బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ రాధే తో వస్తున్నాడన్నా చిరు ఆచార్య డేట్ మార్చలేదు. ఆచార్య మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నా.. ప్రస్తుతం కరోనా వలన మెగా ఫాన్స్ సెలెబ్రేషన్స్ మిస్ అయ్యారు. మెగా ఫాన్స్ ఆచార్య రిలీజ్ తో బెన్ ఫిట్ షోస్, ఫస్ట్ డే కలెక్షన్స్, ప్రీమియర్స్ అంటూ నానా హంగామా చేసేవారు. ఆచార్య మూవీపై చిరు - రామ్ చరణ్ ల మల్టీస్టారర్ మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడిని కూడా క్యూరియాసిటీతో ఉన్నారు.
రామ్ చరణ్ - చిరు కాంబో, చరణ్ - పూజ కాంబో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్, మణిశర్మ మ్యూజిక్ అన్నీ ఆచార్యపై హైప్ ని క్రియేట్ చేసాయి. మరి కరోనా వలన పోస్ట్ పోన్ అయిన ఆచార్య మళ్ళి ఆగష్టు లో చిరు పుట్టిన రోజుకి రిలీజ్ అంటున్నారు. అప్పటికేం జరుగుతుందో చూడాలి.