Advertisementt

వ్యాక్సిన్ వేయించుకున్న సూపర్ స్టార్

Thu 13th May 2021 02:42 PM
superstar rajinikanth,sowndarya rajinikanth,rajinikanth first dose,covid19 vaccine  వ్యాక్సిన్ వేయించుకున్న సూపర్ స్టార్
Rajinikanth gets the first dose of Covid19 vaccine వ్యాక్సిన్ వేయించుకున్న సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

కరోనా ని తరిమి కొట్టాలంటే మాస్క్, సామజిక దూరం, కరోనా వ్యాక్సినేషన్ అంతే. ఇంకేమి కరోనా నుండి ప్రజలని రక్షించలేవు. కరోనా తో గత ఏడాది తొమ్మిదినెలలు కోల్పోయిన ప్రజలు.. ఈ ఏడాది ఎన్ని నెలలు కరోనాకి అప్పగించాలో తెలియడం లేదు. ఇండియా లో సెకండ్ వేవ్ ఉధృతితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ప్రజల్లో చైతన్యం తేవడానికి సెలబ్రిటీస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ఆ ఫొటోస్ ని ట్వీట్ చేస్తున్నారు. టాలీవుడ్ నుండి నాగార్జున, మోహన్ బాబు, మహేష్ లాంటి వాళ్ళు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. కరోనా నుండి రక్షణ వచ్చినట్టే అని నిపుణులు చెబుతున్నా చాలామంది వ్యాక్సిన్ వేయించుకుపోవడానికి జంకుతున్నారు.

తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కూతురు సౌందర్య  రజినీకాంత్ దగ్గరుండి రజినీకాంత్ కి కరోనా వ్యాక్సిన్ వేయించుతున్న ఫోటో వైరల్ గా మారింది. రజినీకాంత్ సెకండ్ వేవ్ ఉధృతిలోను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో అన్నత్తే షూటింగ్ కంప్లీట్ చేసి రీసెంట్ గానే చెన్నై కి వెళ్లారు. ఇక ఈ నెలాఖరున రజినీకాంత్ అమెరికా వెళ్ళబోతున్నారు. మరో రెండు నెలలపాటు ఆయన అక్కడే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు. అందుకే రజిని అన్నత్తే షూటింగ్ త్వరగా రిస్క్ చేసి అయినా కంప్లీట్ చేసేసారు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న ఆయన తాజాగా కో వ్యాక్సిన్ టీకా వేయించేసుకున్నారు.

Rajinikanth gets the first dose of Covid19 vaccine:

Superstar Rajinikanth gets the first dose of Covid19 vaccine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ